నక్కపల్లి టీడీపీలోకి 60 మంది వైఎస్సార్‌సీపీ నేతలు..
18/April/2026 19:42
Share:
అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 18 ( క్రైo అనాలిసిస్ ప్రతినిధి ఆనంద్ ): నక్కపల్లి మండలంలో వైఎస్సార్‌సీపీకి చెందిన సుమారు 60 మంది నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో వారు పార్టీ కండువాలు ధరించి అధికారికంగా చేరికయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి దిశగా టీడీపీ కృషి చేస్తున్నందునే ప్రజలు ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. కొత్తగా చేరిన వారికి పార్టీ అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.