ఏలూరు ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ ..

ఏలూరు ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ ..

31/May/2026 21:19    Share:   

ఏలూరులోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం..

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, 
అత్యవసర వైద్య సహాయం అవసరమైన వారికి ఆర్ధిక భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో దోహదమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. ఇప్పటివరకు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 5కోట్ల, 74లక్షల రూపాయల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు, ఎల్‌వోసిలను బాధితులకు అందించి, వారిని ఆదుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఏలూరు పవర్‌ పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న వారికి ఆర్టీసి విజయవాడ జోన్‌-2 చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడుతో కలిసి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు, ఎల్‌వోసి కాపీలను పంపిణీ చేశారు. 34 మంది బాధితులకు మంజూరైన 12లక్షల, 24వేల, 103 రూపాయల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు అందించారు. అలాగే 24లక్షల, 23వేల, 26 రూపాయల విలువైన 11ఎల్‌వోసి కాపీలను అత్యవసర వైద్య సహాయం కావాల్సిన వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు వారు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ళ కాలంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 659 మంది బాధితులకు 5కోట్ల, 74లక్షల, 46వేల, 828 రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు చెప్పారు. ప్రజారోగ్యం పరిరక్షణకు కూటమి ప్రభుత్వం చూపే నిబద్దతకు ఇదే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. దాంతోపాటూ తాను నియోజకవర్గ ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ప్రతి గురువారం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తోన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన,,, వేసవిని దృష్టిలో ఉంచుకుని చలివేంద్రాలతో పాటూ, పలు సేవా కార్యక్రమాలను కూడా విస్త్రృతం చేసినట్లు వెల్లడించారు. సామాజిక మాద్యమాలలో కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారాలు చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికిన ఎమ్మెల్యే బడేటి చంటి, ప్రభుత్వం చేస్తోన్న మంచిని ప్రతిఒక్కరూ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్ళాలని పిలుపునిచ్చారు. ఆర్టీసి జోన్‌ 2 చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చొరవతోనే నియోజకవర్గానికి అత్యధికంగా ముఖ్యమంత్రి సహాయ నిధులు వచ్చాయని, తద్వారా బాధితులకు ఎంతో బాసట లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, ఈడా చైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ పరిశీలకులు షేక్ మీరా వల్లీ పలువురు కార్పొరేటర్లు,క్లస్టర్ ఇంచార్జిలు, డివిజన్ ఇంచార్జీలు పలువురు కూటమి పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు...
Breaking News

Subscribe our Newsletter