పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి : సిపిఎం

పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి : సిపిఎం

26/May/2026 13:39    Share:   

క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ :

రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ అచ్చుతాపురం పెట్రోల్ బంకు వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వినియోగదారులతో కలిసి మోటార్ సైకిళ్లను నడిపిస్తూ ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సిపిఎం అచ్చుతాపురం మండల కన్వీనర్ రొంగలి రాము, కూండ్రపు సోమునాయుడు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 12 రోజుల వ్యవధిలో నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి ప్రజల నడ్డి విరిచిందని విమర్శించారు. ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.116.66, డీజిల్ ధర రూ.104.37కు చేరిందని తెలిపారు.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగాయని చెబుతూ ప్రజలపై నేరుగా భారం మోపుతున్నారని, కానీ చమురు ధరలు తగ్గినప్పుడు మాత్రం ధరలు తగ్గించలేదని ఆరోపించారు. ఈ పెంపుదలను వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది.
చమురు సంస్థల ఒత్తిడితో పెట్రోలు, డీజిల్ ధరలను మరింతగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోందన్న వార్తలు ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ఎన్నికల ముందు చమురు కొరత లేదని, ధరలు పెరగవని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వరుసగా ధరలు పెంచడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు.
ఒక్కసారిగా భారీగా ధరలు పెంచితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని భావించి దశలవారీగా పెంచుతూ ప్రజలను వంచిస్తున్నారని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో రవాణా ఖర్చులు పెరిగి అన్ని రకాల సరుకుల ధరలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్‌పై విధిస్తున్న పన్నులను తగ్గించి ప్రజలపై భారం తగ్గించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు చేపల తాతయ్య, గుర్రం పైడిరాజు, బొడ్డు శ్రీను, సరగడం చిన్నబాబు, ఉగ్గిన వెంకట్రావు, పంచదార రామకృష్ణ
Breaking News

Subscribe our Newsletter