యలమంచిలి  రామనగర్ ప్రజలకు శుభవార్త తెలిపిన కోటార్ శ్రీనివాస్ మాస్టర్..!

యలమంచిలి రామనగర్ ప్రజలకు శుభవార్త తెలిపిన కోటార్ శ్రీనివాస్ మాస్టర్..!

25/April/2026 07:56    Share:   

క్రైమ్ అనాలిసిస్ - టివియస్ ప్రకాష్ యలమంచిలి :
యలమంచిలి రామనగర్ ప్రాంత ప్రజలకు శుభవార్త అందింది. కోటార్ శ్రీనివాస్ మాస్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం, 2026–27 ఆర్థిక సంవత్సరానికి రామనగర్ ప్రాంతంలో సీసీ రోడ్ల నిర్మాణానికి సుమారు రూ. 50 లక్షలు మంజూరు చేయబడ్డాయి.ఈ అభివృద్ధి పనులు అంజనేయ స్వామి కోవెల నుంచి శేషుకొండ కాలనీ వరకు దశలవారీగా చేపట్టబడనున్నాయి. మొదటి దశలో శేషుకొండ కాలనీలో రూ. 35 లక్షలతో పనులు ప్రారంభమవుతుండగా, రామనగర్ ప్రధాన ప్రాంతంలో రూ. 15 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.అదేవిధంగా, రాబోయే వేసవి కాలానికి, అంటే 2027 మార్చి నాటికి ప్రతి ఇంటికి ట్యాప్ పైప్‌లైన్ ద్వారా తాగునీటి సరఫరా అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారని  కోటార్ శ్రీనివాస్ మాస్టర్ పేర్కొన్నారు.ఈ అభివృద్ధి పనులతో రామనగర్ ప్రాంతంలో మౌలిక వసతులు మెరుగుపడి ప్రజలకు పెద్ద ఎత్తున ఉపశమనం లభించనుంది.
Breaking News

Subscribe our Newsletter