రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం.ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర..
17/March/2026 18:47
Share:
రైతు బాగున్నపుడే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ బాగుంటారు సంప్రదాయ పంటలతోపాటు లాభాదాయ పంటలపై రైతులు దృష్టి సారించాలి అనకాపల్లి మండలం వెంకుపాలెం గ్రామంలో 'రైతన్నా మీకోసం' కార్యక్రమంలో పాల్గొన్నా మంత్రి కొల్లు రవీంద్ర అనకాపల్లి (వెంకుపాలెం) మార్చి 16; రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అనకాపల్లి మండలం వెంకుపాలెం గ్రామం రైతు సేవా కేంద్రం వద్ద సోమవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన'రైతన్న మీకోసం' కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ తో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు చేసిన మేలును వివరించడం లక్ష్యంగా గన్నవరంలో 'రైతన్న మీకోసం' కార్యక్రమం ప్రారంభించారు. రాష్ట్రంలో సుమారు 46.83 లక్షల మందికి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేశాం. తొలి విడతలో రూ.7000 చొప్పున రూ.3174 కోట్లు, రెండో విడతలో రూ.3,135 కోట్లు మూడో విడతలో రూ.6000 చొప్పున రూ.2600 కోట్లు చొప్పున సుమారు రూ.9000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. అనకాపల్లి జిల్లాలో రూ.132 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు. ఎపుడూ లేని విధంగా రైతు సంక్షేమం కోసం రూ.53 వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టాం అన్నారు. ప్రస్తుతం పంటల దిగుబడి కోసం రసాయనాల వినియోగం తీవ్రంగా చేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. రసాయన వినియోగం పెంచితే భవిష్యత్ అగమ్యగోచరం అవుతుంది. పంజాబ్ లో ఏం జరిగిందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. క్యాన్సర్ వ్యాధితో రైతులు ప్రాణాలతో పోరాటం చేస్తున్నారు. ప్రతి రోజు క్యాన్సర్ బాధితులతో ఒక రైలు డిల్లీ వెళ్లాల్సిన దుస్తితి దాపురించింది. అందుకే ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. తద్వారా దిగుబడులు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. మొన్నటి వరకు వ్యవసాయం అంటే గోదావరి జిల్లాలు మాత్రమే గుర్తొచ్చేవి. కానీ నేడు అనంతపురం హార్టికల్చర్ ద్వారా గోదావరి జిల్లాలకు పోటీగా నిలుస్తోంది. స్ప్రింక్లర్స్, డ్రిప్ ఇరిగేషన్ కు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి. 2027 నాటికి పోలవరం పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నాం. లెఫ్ట్ కెనాల్ ద్వారా అనకాపల్లి జిల్లాకు పుష్కలంగా సాగు నీరు అందించే అవకాశం ఉంది. బిల్ గేట్స్ ఏపీ పర్యటనలో వ్యవసాయ అవసరాలకు సాంకేతిక సహకారం అందించేందుకు ముందుకొచ్చారు. పంటలను అమ్ముకోవడం కాకుండా ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకు రావాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ మాట్లాడుతూ వ్యవసాయం, అనుబంద రంగాల శాఖల సిబ్బంది రైతుల ఇళ్లకు వెళ్లి ఆధునిక వ్యవసాయ పద్ధతులతో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధనతో ' రైతులకు అవగాహన కలిగించడం రైతన్న మీకోసం.' కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. మరింత విస్తీర్ణంలో ప్రకృతి సాగుచేసేలా రైతులలో అవగాహన పెంచాలని వ్యవసాయాధికారులు కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో పొలంపిలుస్తోంది, పొలంబడి కార్యక్రమాలు నిర్వహించి సాగులో ఉత్తమ యాజమాన్య పద్దతులపై రైతులకు అవగాహన కలిగిస్తున్నామన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై అందించడమే కాక 'అన్నదాత సుఖీభవ' పధకం కింద రెండు విడతలలో 2,42,536 మంది రైతులకు 134.27 కోట్ల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని ప్రభుత్వం అందించిందన్నారు. సాగులో యాంత్రీకరణను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, జిల్లాలో 60 డ్రోన్లను రైతులకు అందించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, వ్యవసాయంలో సాంకేతికత, ఆహార శుద్ధి, ప్రభుత్వ మద్దతు. పాడి రైతులకు అండ వంటి పంచ సూత్రాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు, వాటిని ప్రతీ రైతు వినియోగించుకునే విధానాలపై రైతుల ఇంటివద్దకు వెళ్లి ప్రతీ రైతుకు వ్యవసాయ, అనుబంధాల రంగాల సిబ్బంది 15 రోజులపాటు తెలియజేశారన్నారు. ఈ కార్యక్రమంలో పంచ సూత్రాలైన నీటి భద్రత, డిమాండ్ ఆదారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెస్సింగ్, ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు గురించి అవగాహన కల్పించడం జరుగుతుందని, కావున రైతు సోదరులు ఈ కార్యక్రమమ ను సద్వినియోగం చేసుకోవాలని ఈ కార్యక్రమం లో జిల్లా వ్యవసాయ అధికారి ఆశా దేవి, వివిధ రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు బత్తుల తాతీయ్య బాబు, పీలా గోవిందా సత్యన్నారాయణ, మళ్ల సురేంద్ర బాబు డి సి ఎం ఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ, మాజీ ఎమ్మెల్సి బుద్ధా నాగ జగదీష్, వ్యవసాయం, అనుబంధ రంగాల శాఖల అధికారులు, సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.