
ఈ పరిస్థితిని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సమీక్షించారు. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బర్డ్ ఫ్లూ వల్ల నష్టపోయిన కోళ్ల ఫారాల రైతులకు ప్రభుత్వం తగిన నష్టపరిహారం అందిస్తామని ప్రకటించారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు సమన్వయంతో గ్రామాల్లో పర్యటించిన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడూ పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. అన్నమయ్య జిల్లా పరిధిలో ఎక్కడైనా కోళ్లు అసాధారణ రీతిలో మరణిస్తే 70139 14401, 93982 62752 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.
బర్డ్ ఫ్లూతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు. కోళ్ల నుంచి మనుషులకు ఈ వైరస్ సోకే అవకాశాలు చాలా తక్కువ అని తెలిపారు. 100 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి మీద ఉడికించిన మాంసంలో వైరస్ ఉండదని.. బాగా ఉడికించిన మాంసాన్ని తీసుకోవాలని సూచించారు. అయితే వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం కనీసం 10 రోజుల పాటు కోడిమాంసం, గుడ్ల తినకపోవడం మంచిదని చెబుతున్నారు.