రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం: బ్లాక్ స్పాట్ల వద్ద సంయుక్త తనిఖీ

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం: బ్లాక్ స్పాట్ల వద్ద సంయుక్త తనిఖీ

12/February/2026 20:30    Share:   

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం: బ్లాక్ స్పాట్ల వద్ద పోలీసు, రవాణా మరియు ఎన్.హెచ్.ఏ అధికారుల సంయుక్త తనిఖీ

అనకాపల్లి (కశింకోట), ఫిబ్రవరి 12: జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్., మరియు అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీమతి ఎం.శ్రావణి గారి ఆదేశాల మేరకు, జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే ప్రధాన ధ్యేయంగా కశింకోట పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన జంక్షన్లు మరియు అత్యంత ప్రమాదకర ప్రాంతాలలో (Black Spots) సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయి ఉమ్మడి తనిఖీలు నిర్వహించారు.
​ఈ కార్యక్రమంలో కశింకోట ఇన్స్పెక్టర్ స్వామి నాయుడు, అనకాపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి  శ్రీ జి.మనోహర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (MVI) గోపికృష్ణ, AMVI అమృత గ్రీష్మ, అనకాపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకట నారాయణ, రోడ్లు మరియు భవనాల శాఖ (R&B) డీఈ, నరసింహమూర్తి , నేషనల్ హైవేస్ అథారిటీ (NHAI) మేనేజర్ లక్ష్మణరావు, సీనియర్ ఇంజనీర్ వసంత సాయి, టోల్ ప్లాజా మేనేజర్ కృష్ణ, మరియు సత్యనారాయణ తదితర సిబ్బంది పాల్గొన్నారు.​
​అధికారుల బృందం ఈ క్రింది ప్రాంతాలలో పర్యటించి ప్రమాదాలకు గల కారణాలను క్షుణ్ణంగా విశ్లేషించారు:కశింకోట జంక్షన్ 
బయ్యవరం జంక్షన్ తాళ్ళపాలెం జంక్షన్ నర్సింగిబిల్లి గొబ్బూరు ఎన్.జి.పాలెం ​
గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, ఆయా ప్రాంతాలలో రోడ్డు మలుపులు, సిగ్నలింగ్ వ్యవస్థ మరియు రాత్రి సమయాల్లో వెలుతురు సౌకర్యాలను పరిశీలించారు.​
ప్రమాదాల నివారణకు గాను అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం, ప్రమాద హెచ్చరిక బోర్డులు  పెట్టడం మరియు జంక్షన్ల వద్ద అవసరమైన మెరుగుదల పనులు తక్షణమే చేపట్టాలని అధికారులకు సూచించారు.​
పోలీస్, రవాణా, నేషనల్ హైవే (NHAI) మరియు ఆర్ అండ్ బి (R&B) శాఖలు నిరంతరం సమన్వయంతో పనిచేస్తూ ప్రయాణికుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు.


​ఈ సందర్భంగా కశింకోట ఇన్స్పెక్టర్ స్వామి నాయుడు మాట్లాడుతూ.. రహదారి భద్రతలో భాగంగా ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. అతివేగం, అజాగ్రత్త మరియు నిబంధనల ఉల్లంఘన వల్ల విలువైన ప్రాణాలు కోల్పోకుండా, పోలీసు మరియు రవాణా శాఖలకు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Breaking News

Subscribe our Newsletter