భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్ మెంట్ గ్యారంటీ యాక్ట్ అమలు చేయాలి ఏఐవైఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్
03/May/2026 21:28
Share:
యువతకు మెరుగైన ఉద్యోగం ఉపాధి కల్పించాలి. ఏఐవైఎఫ్ ఏలూరు జిల్లా కన్వీనింగ్ కమిటీ సభ్యులు కురెళ్ళ వరప్రసాద్. కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు అఖిలభారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 67వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆర్.ఆర్.పేట, స్ఫూర్తి భవన్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐవైఎఫ్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మాజీ కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ 1959 మే 3వ తేదీన అఖిల భారత యువజన సమాఖ్య ఢిల్లీ నగరంలో ఏర్పడిందని తెలిపారు. ఆనాటి నుండి దేశంలోని యువతకు మెరుగైన ఉద్యోగం,ఉపాధి కల్పించాలని అనేక పోరాటాలు నిర్వహించిందని కొనియాడారు. 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పించాలని దేశవ్యాప్తంగా ఉద్యమం నిర్వహించి విజయం సాధించిందని కొనియాడారు.చదువుకున్న యువతకు ఉద్యోగ హక్కు కల్పించాలని,కుల,మత వివక్షతలకు వ్యతిరేకంగా మరియు లౌకికవాదాన్ని కాపాడటానికి ఎఐవైఎఫ్ చేస్తున్న పోరాటాలలో యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని జండా ఆవిష్కరణ చేసిన ఏలూరు జిల్లా కన్వీనింగ్ కమిటీ సభ్యులు కురెళ్ళ వరప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న యువత వ్యతిరేక విధానాలపై ఎఐవైఎఫ్ పోరాడుతుందని తెలిపారు.66 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించి అనేక విజయాలను సాధించి 67వ ఏడాదిలో అడిగిన సందర్భంలో మరింత ఉత్సాహంతో యువత సంక్షేమం కోసం, దేశాభివృద్ధి కోసం మరిన్ని పోరాటాల్ని ఎఐవైఎఫ్ నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు,శాయన అభిలాష్ కుమార్,గొర్లి స్వాతి, ఉప్పులూరి లక్ష్మి,బాలిన కృష్ణ ప్రసాద్,యర్రా వెంకటేశ్వర రావు,తదితరులు పాల్గొన్నారు.