జాతీయ మహిళా ప్రజాప్రతినిధుల సదస్సుకు జెడ్పీ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ

జాతీయ మహిళా ప్రజాప్రతినిధుల సదస్సుకు జెడ్పీ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ

11/March/2026 07:21    Share:   

#రాష్ట్ర గ్రామ స్వరాజ్ అభియాన్ (RGSA) – జాతీయ మహిళా ప్రజాప్రతినిధుల సదస్సుకు జెడ్పీ చైర్‌పర్సన్ ఎంపిక
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు 
రాష్ట్ర గ్రామ స్వరాజ్ అభియాన్ (RGSA) కార్యక్రమం పరిధిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, 2026 మార్చి 11న న్యూఢిల్లీ లో నిర్వహించబడనున్న ఒక రోజు జాతీయ మహిళా ఎన్నికైన ప్రజాప్రతినిధుల సదస్సులో పాల్గొనుటకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 13 మంది ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులు మరియు 6 మంది పంచాయతీరాజ్ సంస్థల అధికారులను ఎంపిక చేయడం జరిగింది.
ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ గారు ఎంపిక కావడం జిల్లా ప్రజలకు గర్వకారణంగా నిలిచింది. గ్రామీణ అభివృద్ధి, మహిళా సాధికారత మరియు పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతానికి ఆమె అందిస్తున్న సేవలను గుర్తించి ఈ అవకాశాన్ని కల్పించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఈ జాతీయ సదస్సులో దేశవ్యాప్తంగా మహిళా ప్రజాప్రతినిధులు పాల్గొని గ్రామీణాభివృద్ధి, స్థానిక స్వయంపాలన మరియు మహిళా నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చలు జరపనున్నారు. ఇతర రాష్ట్రాల మహిళా ప్రజాప్రతినిధులతో అనుభవాలను పంచుకోవడం ద్వారా ఉత్తమ పద్ధతులను తెలుసుకునే అవకాశం కలుగుతుంది.
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ గారు ఈ సదస్సుకు ఎంపిక కావడం పట్ల జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు.
Breaking News

Subscribe our Newsletter