మహిళా రిజర్వేషన్ బిల్లుతో  నూతన చరిత్రకు శ్రీకారం...

మహిళా రిజర్వేషన్ బిల్లుతో నూతన చరిత్రకు శ్రీకారం...

16/April/2026 20:16    Share:   

మహిళా రిజర్వేషన్ బిల్లుతో  నూతన చరిత్రకు శ్రీకారం... ముక్తకంఠంతో నినదించిన కూటమి నాయకులు ఏలూరులో ఉత్సాహంగా నారీ శక్తివందన్   ర్యాలీ 
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,
దశాబ్దాల కల అయినా చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా మద్దతు ప్రకటించాలని కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు కోరారు. మహిళలకు గౌరవప్రదంగా 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పం మరికొన్ని గంటల్లో నెరవేరనుందని, ఆ క్షణాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని వారు పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్లో ఈనెల 16, 17,  18 తేదీల్లో  ప్రత్యేక చర్చ జరుగుతున్న నేపథ్యంలో మహిళా బిల్లుకు మద్దతు తెలుపుతూ కూటమి ఆధ్వర్యంలో  ఏలూరులో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక విజయ్ విహార్ సెంటర్ నుండి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నిషిధ రాజ్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, బిజెపి జిల్లా అధ్యక్షులు సిహెచ్ విక్రమ్ కిషోర్, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిషీధ రాజ్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలన్నారు. కొంతమంది మహిళలను అణగదొక్కాలన్న  సంకుచిత మనస్తత్వంతో బిల్లును అడ్డుకోవాలని చూస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఎవరు ఏ విధంగా అడ్డుకున్నా ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం  పొంది  తీరుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. టిడిపి జిల్లా అధ్యక్షులు,  ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో ప్రతి రంగంలోనూ మహిళలు ముందంజలో ఉన్నారని చెప్పారు. రాజ్యాంగ పదవుల్లో కూడా వారికి సముచిత స్థానం కల్పించాలన్న లక్ష్యంతో కూటమి మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కృత నిశ్చయంతో  ఉందని ఆయన పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన క్షణాలు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయని చెప్పారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే సమాజంలో సుఖశాంతులు అభివృద్ధి చెందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ  మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలన్న కూటమి నిర్ణయం పట్ల ప్రతి ఒక్కరూ హర్షం  వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ బిల్లు ఒక చరిత్ర సృష్టిస్తుందన్నారు. బిజెపి జిల్లా అధ్యక్షులు సిహెచ్ విక్రమ్ కిషోర్ మాట్లాడుతూ మూడు రోజులపాటు మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగే చర్చకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని కోరారు . ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, మాజీ చైర్మన్ పూజారి నిరంజన్, బిజెపి నగర కన్వీనర్ గాది రాంబాబు, క్లస్టర్ ఇంచార్జ్ మరియు కార్పొరేటర్ నాయుడు సోము శారద, కార్పొరేటర్ తంగిరాల అరుణ,కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, బిజెపి నాయకురాలు శరణాల మాలతీ రాణి, నిషిత రాజు, రోహిణి పలువురు తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు కూటమి నాయకులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter