కష్టాల్లో తోడుగా 'వెలుగు' సిబ్బంది: ఖాజీపాలెం వివోఏ కుటుంబానికి భారీ విరాళం
05/April/2026 06:13
Share:
పరిమళించిన మానవత్వం వెలుగు వివోఏ కుటుంబాన్ని ఆదుకున్న సిబ్బంది యలమంచిలి/అచ్చుతాపురం మండలం ఖాజీపాలెం గ్రామానికి చెందిన వెలుగు డిపార్ట్మెంట్ లో వి ఓ ఏ గా పనిచేస్తూ గత నెల 25వ తేదీన హఠాత్ మరణం చెందిన కూనిశెట్టి. రేణుక కుటుంబానికి డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వివోఏలు, సీసీలు, ఏపిఎం లు కలిసి ఎటువంటి ఆధారం లేని ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం పెద్ద ఎత్తున విరాళాలు సహకరించారు. ఆ రకంగా సేకరించిన రూ.2,22,600/- శనివారం నాడు ఖాజీపాలెం లో జరిగిన పెద్దకర్మ కు హాజరైన డి ఆర్ డి ఏ ప్రాజెక్ట్ అధికారి సచిదేవి ఇతర వెలుగు అధికారులు, వివో ఏ ల సంఘం (సి ఐ టి యు) రాష్ట్ర అధ్యక్షురాలు సిహెచ్ రూపా దేవి, జిల్లా వివి శ్రీనివాసరావు తో కలిసి ఆ మొత్తాన్ని ఆ కుటుంబానికి అందజేశారు. వివోఏ రేణుక సుదీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడటం, ఆమె భర్త నరాలు చచ్చిపడి మంచానికే పరిమితం కావటం, ఒక పాప బాబు చిన్న వయసుకులే కావటంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం వెలుగు వివోఏలు, అధికారులు మానవత్వంతో ఆ కుటుంబానికి సహాయం చేయాలని విరాళాలు సేకరించి అందజేశారు. ఈ సందర్భంగా వివో ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సిహెచ్ రూపా దేవి మాట్లాడుతూ వివోఎ లు గా అత్యంత పని ఒత్తిడితో పనిచేయడంతో పాటు ప్రమాదవశాత్తు మారనిచిన ఆ కుటుంబానికి దిక్కు లేకుండా అయిపోతుందని, కనీసం ప్రమాద బీమా సౌకర్యం కూడా లేదని, ప్రభుత్వం వివోఏలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివోఎల సంగం జిల్లా కార్యదర్శి కె. వెంకటలక్ష్మి, మండల నాయకులు రమణ, లావణ్య, శాంతి, దేవి, రమణ సిఐటియు మండల కన్వీనర్ కె.సోమునాయుడు తదితరులు ఈ సంతాప కార్యక్రమంలో పాల్గొన్నారు.