ఆటో ,టాటా ఏసీ ,మోటార్ ట్రాన్స్ పోర్టు కార్మికులు ఫిబ్రవరి 12 సమ్మె లో పాల్గొంటాం
07/February/2026 10:02
Share:
ఆటో ,టాటా ఏసీ ,మోటార్ ట్రాన్స్ పోర్టు కార్మికులు ఫిబ్రవరి 12 సమ్మె లో పాల్గొంటాం
సిఐటియు
యలమంచిలి దేశవ్యాప్త సమ్మెలో ట్రాన్స్ పోర్టు కార్మికులు పాల్గొనాలని ఈరోజు అచ్చుతాపురం లో సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్. రాము ,మండల కన్వీనర్ కే. సోము నాయుడు మాట్లాడుతూ రోడ్ ట్రాన్స్ పోర్టు పైన ఆధారపడి వేలాది మంది ఉపాధి పొందుతున్నారు డ్రైవర్లు, డ్రైవర్ కం ఓనర్లు ,ఆటో, టాక్సీ ,మెకానిక్ ,లారీ , బస్, క్రేన్, టాక్టర్ వంటి వాటిపై స్వయం ఉపాధి పొందుతూ ఉన్నారు బిజెపి ప్రభుత్వం మోటార్ వెహికల్ సవరణ చట్టం 2023 తీసుకొచ్చి రవాణారంగంపై భారాలు పెంచింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ తేవడం వల్ల కార్మిక చట్టాలను సమాధి చేసింది పనిగంటలకు పరిమితి లేదు సంక్షేమ చట్టం గురించి ఊసే లేదు. యాక్సిడెంట్లో డ్రైవర్లకు వైద్య సదుపాయం గురించి గాని మృతి చెందితే చట్ట ప్రకారంగా రావాల్సిన నష్టపరిహారం పైన స్పష్టత లేదు.ట్రాన్స్పోర్ట్ కంపెనీలో యూనియన్ పెట్టుకునే అవకాశాలు లేవు వాహనాలు ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ,ఆర్టీవో ఆఫీస్ లో చలానా చార్జీలు ,టోల్గేట్, రోడ్ టాక్స్ ,గ్రీన్ టాక్స్ ,ఫిట్నెస్ సర్టిఫికెట్స్ వంటివి పెట్రోల్, డీజిల్ ధరలు అన్ని పెంచారు. మరోవైపు నిత్యవసర సరుకులు ధరలు పెరుగుతున్నాయి దీంతో ట్రాన్స్ పోర్ట్ కార్మికులు జీవితాలు సుడిగుండంలోనికి నెట్టబడుతున్నాయని, మహిళలకు ఉచిత బస్సుతో కిరాయిలు లేక జీవితాలు రోడ్డు పాలు అవుతున్నాయి డ్రైవర్లకు నెలకు 30000 జీతం ఇవ్వాలని ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలని , వాహన మిత్ర పథకానికి ఎటువంటి సరుతలు లేకుండా అర్హులైన డ్రైవర్ల అందరికీ అమలు చేయాలని జరిగే ఫిబ్రవరి 12 సమ్మెలో ట్రాన్స్పోర్ట్ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. యువశక్తి ఆటో యూనియన్ నాయకులు కాకి. శీను, పోలార్ గోవిందు,దమ్ము, శేఖర్ మరిడిమాంబ ఆటో యూనియన్ నాయకులు పి. పైడికొండ పి. లొవరాజు ఎం. సూరిబాబు శ్రీ శ్రీ విజయ దుర్గ టాటా ఏసీల యూనియన్ కె. వరబాబు ఎస్. మోహన్ బి. శ్రీను శ్రీ కనకదుర్గ ఆటో యూనియన్ కె. ఆనంద్ టి. సంజీవి, ఎం. అప్పలనాయుడు ఆటో కార్మికులు పాల్గొన్నారు