యలమంచిలి లో ఇంటర్నేషనల్ యోగ దినోత్సవం శిక్షణా తరగతులు

యలమంచిలి లో ఇంటర్నేషనల్ యోగ దినోత్సవం శిక్షణా తరగతులు

11/June/2026 20:26    Share:   

యలమంచిలి పట్నంలో యోగేంద్ర ఇంటర్నేషనల్ యోగ డే పురస్కరించుకొని జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బందికి ఉదయం ఎంపీడీవో ఆఫీసులో,సాయంత్రం మున్సిపాలిటీ ఆఫీసులో ట్రైనర్స్ ట్రైనింగ్ కోర్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు "ది ఆర్ట్ ఆఫ్ లివింగ్" యోగా మాస్టారు మల్ల రాము తెలిపారు.జూన్ 21న జరగబోయే 12వ అంతర్జాతీయ యోగ దినోత్సవం ఒక పండుగలా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

యోగా ప్రాముఖ్యత

  • ఆరోగ్యానికి యోగా – సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించే ఏకైక మార్గం.

  • మానసిక ఒత్తిడి – యోగా ద్వారా తగ్గించుకోవచ్చు.

  • శారీరక రుగ్మతలు – యోగాసనాలు తొలగించడంలో తోడ్పడతాయి.

  • జీవనశైలి వ్యాధులు – నియంత్రణలో ఉంచడంలో యోగా సహాయపడుతుంది.

మల్ల రాము సందేశం

  • ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తేనే ఫలితం పొందగలమని అన్నారు.

  • యోగాసనాలు, ధ్యానం దినచర్యలో భాగం చేస్తే పనితీరులోనూ ఉపయోగపడుతుందని తెలిపారు.

  • యోగా నేర్చుకోవాలనుకునే వారు (92472728) నంబరును సంప్రదించాలని కోరారు.

Breaking News

Subscribe our Newsletter