రాష్ట్ర ప్రయోజనాలే కూటమి ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే బడేటి చంటి

రాష్ట్ర ప్రయోజనాలే కూటమి ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే బడేటి చంటి

11/April/2026 07:12    Share:   

ఏలూరు, ఏప్రిల్  రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఏలూరు ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షులు బడేటి కోట రామారావు (చంటి) పేర్కొన్నారు. శుక్రవారం ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు
రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అమరావతి రాజధాని నిర్మాణానికి అన్ని రాజకీయ పక్షాలు మద్దతు తెలుపుతుంటే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం రాజకీయ స్వార్థంతో అడ్డంకులు సృష్టించడం సరికాదని ఆయన విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకునేలా సాగుతున్న వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని చంటి పేర్కొన్నారు
పత్రికా స్వేచ్ఛను గౌరవించాలి:
ఇదే క్రమంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై జరిగిన దాడులను ఆయన ఖండించారు. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ అత్యంత కీలకమని, మీడియాపై దాడులు చేయడం అమానుషమని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రభుత్వం ఉపేక్షించబోదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏలూరు నగర టీడీపీ అధ్యక్షులు చోడే వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter