ఏలూరులో అంధుల చదరంగం పోటీలు..

ఏలూరులో అంధుల చదరంగం పోటీలు..

22/March/2026 20:30    Share:   

సినీ హీరో రామ్ చరణ్ తేజ్ గారి పుట్టినరోజు ను పురస్కరించుకుని ఏలూరులో అంధుల చదరంగం పోటీలు..
ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం సమాజానికి దిక్సూచిగా నిలుస్తుంది - రెడ్డి అప్పల నాయుడు 
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి 
ఏలూరు, మార్చి 22:- సినీ హీరో రామ్ చరణ్ తేజ్ గారి పుట్టినరోజు ను పురస్కరించుకుని ఏలూరు వైఎంహెచ్ఏ హాలు ప్రాంగణంలో ఈనెల 21, 22 తేదీల్లో ఏలూరు సిటీ చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో విజువల్లి ఛాలెంజ్డ్ తెలుగు రాష్ట్రాల ఓపెన్ చెస్ టోర్నమెంట్ ను ఏలూరు సిటీ చిరంజీవి ఫ్యాన్స్ అద్యక్షుడు శానం శ్రీ రామకృష్ణ మూర్తి గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు హాజరై పోటీలను తిలకించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 100 మంది అంధులు పోటీల్లో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు ఈ పోటీలు జరిగాయి. మొత్తం 6 నుండి ఏడు రౌండ్లు జరుగుతాయని, టాప్ లో నిలిచిన 5 గురితో పాటు 51 మందికి బహుమతులు మెగా ఫ్యాన్స్ మరియు టీం రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో అందిస్తారన్నారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు. వారిలోని ప్రతిభను గుర్తించి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం సమాజానికి దిక్సూచిగా నిలుస్తుందన్నారు. అలాగే ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు తెలిపుతూ, కార్యక్రమాన్ని తలపెట్టిన టీం రామ్ చరణ్ యువశక్తి, మెగా అభిమానులకు అభినందనలు తెలిపారు.
విజువల్లి ఛాలెంజ్డ్ అంధుల అసోసియేషన్ ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ వీరభద్రమ్ మాట్లాడుతూ మేము ఏ కార్యక్రమంలో పాల్గొన్న, ఏలూరులో కానీ జిల్లాలో కానీ ఎప్పుడూ ఎక్కడికి పిలిచిన మమ్మల్ని ముందుండి నడిపించిన నాయకులు రెడ్డి అప్పల నాయుడు గారు. వారు ఇక్కడికి రావడం, మమ్మల్ని ప్రోత్సహించడం చాలా ఆనందదాయకం.  దాదాపు 7,8 సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా రామ్ చరణ్ తేజ్ గారి పుట్టినరోజు ను పురస్కరించుకుని ఇటువంటి కార్యక్రమాలు తలపెట్టడం ఆనందదాయకం. మెగా ఫ్యామిలీ హీరోలు మరియు వారి వీరాభిమానులు మా అంధుల పట్ల చూపించే ప్రేమ, ఆప్యాయత అమోఘమైనది. ఫ్యాన్స్ అందరికీ మా విజువల్లి ఛాలెంజ్డ్ అంధుల పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు. మమ్మల్ని ప్రతి విషయంలోనూ ప్రోత్సాహించే మా అన్నయ్య రెడ్డి అప్పల నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ శానం శ్రీ రామకృష్ణ మూర్తి, గౌరవ అధ్యక్షులు మారం హనుమంతరావు (అను), మెగా అభిమానులు పి.జగన్, డి.పెదబాబు, సురేష్ మాష్టారు, పవన్, కట్టా ఆది, నరేష్, పూల శ్రీను, దోసపర్తి రాజు, పండు నాయుడు, శానం ఉదయ్ సాయి, రామ్ చరణ్ యువశక్తి ఏలూరు ఇంచార్జీ రామిశెట్టి కళ్యాణ్, దేవా బత్తుల అరవింద్, మోజేష్, రోహిత్, వంశీ, ఫణి తుంపాల తదితరులు పాల్గొన్నారు..
Breaking News

Subscribe our Newsletter