గొన్నాబత్తుల నాగరాజు పదవీ విరమణ మహోత్సవం:ఘనంగా సన్మానించిన మాజీ ఎంపీ పప్పల చలపతిరావు
(క్రైo అనాలసిస్ ప్రతినిధి కన్నేపల్లి నాగ శ్రీనివాస్ శర్మ )
యలమంచిలి (మల్లవరం):
స్థానిక మల్లవరం వద్ద గల ఎస్వీ కన్వెన్షన్ హాల్‌లో గొన్నాబత్తుల నాగరాజు (పి.ఎస్. హెచ్.ఎం) ఉద్యోగ విరమణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ పార్లమెంటు సభ్యులు పప్పల చలపతిరావు, నాగరాజును దుశ్శాలువతో కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
కార్యక్రమానికి అధ్యక్షత వహించిన బి. సత్యనారాయణ మాట్లాడుతూ.నాగరాజు తన సుదీర్ఘ ఉద్యోగ ప్రస్థానంలో అందించిన సేవలను, విద్యా రంగంలో ఆయన చూపిన చొరవను కొనియాడారు. అనంతరం అనకాపల్లి జిల్లా ఏపీటీఎఫ్ అధ్యక్షులు కర్రి ధర్మారావు, జిల్లా అధ్యక్షులు వై. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వృత్తి పట్ల నాగరాజుకు ఉన్న అంకితభావం ఆదర్శనీయమని, ఆయన శేష జీవితం ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు.ఈ ఆత్మీయ సమ్మేళనంలో గెజిటెడ్ హెచ్‌ఎం బి.వి.ఎస్. సాయి బాబా, మల్లిపాటి సత్యనారాయణ, కర్రి వీరభద్రరావు, ఏ. చంద్రశేఖర్, పి. అప్పారావు, వై. సత్యారావు పాల్గొన్నారు. అలాగే రిటైర్డ్ ఉపాధ్యాయులు ఎస్. అప్పల్రాజు, ఏపూరి జగన్నాధ రావు మరియు నాగరాజు కుటుంబ సభ్యులు, మిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.