ఏలూరులో పుప్పాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఘనంగా వంగవీటి మోహన రంగా గారి 79 వ జయంతి వేడుకలు..- నివాళులర్పించిన ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారు..
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు,
బెజవాడ బెబ్బులిగా పేరుగాంచిన, పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, ప్రజా హక్కుల కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుడు స్వర్గీయ వంగవీటి మోహన రంగా జయంతి వేడుకలు ఏలూరు సి.ఆర్.రెడ్డి కాలేజీ వద్ద కాపు–బలిజ సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు పుప్పాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిగాయి.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి రెడ్డి అప్పల నాయుడు గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి గారు, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్ గార్లు హాజరై వంగవీటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్టీసి జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ, ‘‘సాహసమే ఊపిరిగా, తిరుగుబాటే తత్వంగా, దుర్మార్గశాసనాల వ్యతిరేక పోరాటమే జీవిత ధ్యేయంగా రంగన్న జీవించారు. ఆయన పేరు వినగానే బడుగు ప్రజలు చేతులు జోడించి వందనాలు చేస్తారు. అదే గౌరవం, అదే స్ఫూర్తి ఆయన ప్రజా జీవితం పట్ల. ఆయన స్థాయికి రాలేకు పోయినా, ఆయన ఆశయాల బాటలో మనమందరం నడవాలి,’’ అని అన్నారు. వంగవీటి రంగా ఎంతో ముందే తన జీవితాన్ని పేదల కోసం అర్పించాల్సి వస్తుందని తెలిసినా, వెనుకడుగు వేయకుండా పోరాటం చేసిన త్యాగశీలి అని గుర్తుచేశారు. ‘‘1988 డిసెంబరు 26న నిరాహార దీక్ష చేస్తే ప్రాణం పోతుందన్న విషయం ముందే తెలిసినా, వెనక్కి తగ్గలేదు. తన జీవితాన్ని బలిగొన్నాడు. అదే స్థిరత, అదే ప్రజాప్రేమ, అదే త్యాగం,’’ అని అన్నారు. ‘‘రంగన్న విగ్రహాలు కేవలం కృష్ణా లేదా గుంటూరులోనే కాదు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ ప్రతి ఊరిలో ఉండే స్థాయిలో ప్రజల మనస్సుల్లో రంగా గారు చెరగని ముద్ర వేశారని, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి సంవత్సరం ప్రజలు ఆయన జయంతి, వర్ధంతులను స్మరించుకుంటుండటం ఒక ఉదాత్త గౌరవ సూచిక’’ అన్నారు. రెడ్డి అప్పల నాయుడు అభిప్రాయపడుతూ, ‘‘నేడు బడుగు, మధ్య తరగతి వర్గాలపై అన్యాయం జరుగుతున్నప్పుడు రంగన్న ఆశయాల బాటలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పేదల సమస్యల పట్ల మనం అహర్నిశలు పోరాడాలి. జనసేన ఆ లక్ష్యాలే అనుసరిస్తోంది. రంగా గారి త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ, ఆయన బాటలోనే పయనిస్తామని ప్రతిజ్ఞ తీసుకుంటున్నాను’’ అని తెలిపారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, డిప్యూటీ మేయర్ కర్రీ శ్రీనివాస్ మాట్లాడుతూ వంగవీటి మోహనరంగా 1947 జూలై 4వ తేదీ జన్మించారు. వంగవీటి మోహనరంగా మన జాతికి ఎంతో సేవ చేశారని, కేవలం కాపు జాతికే పరిమితం కాకుండా, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి గా నిలిచారని, అతి చిన్న వయసులోనే ఆయన కానరాని లోకాలకు చేరిపోవడం, మన కాపు జాతి మొత్తానికి విచారకరం పేర్కొన్నారు. ఈరోజు రంగా గారి జయంతి సందర్భంగా మన కాపు కుల సంఘం సభ్యులందరూ ఆయనను స్మరించుకోవాలని, అదే విధంగా ఆయన చేసిన సేవలను గుర్తించుకోవాలని, రంగా గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా రైతు విభాగం అధ్యక్షులు నాగం శివ, కాపు–బలిజ సంక్షేమ సేన ఏలూరు అసెంబ్లీ సమన్వయకర్త కంది రంగబాబు, మహిళా జిల్లా అధ్యక్షురాలు సుధా బత్తుల శ్రీదేవి, కాపు నాయకులు గరికిపాటి సూర్యప్రకాశ్, యడ్లపల్లి ప్రసాద్, బోండా రాము నాయుడు, కొప్పిశెట్టి వేణుగోపాల్, రాష్ట్ర కమ్మ కార్పోరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు, నాయకులు రెడ్డి గౌరి శంకర్, బెజవాడ నాగభూషణ్ కుమార్, లక్కింశెట్టి కిరణ్, వేముల బాలు, స్థానిక నాయకులు మల్లెమొగ్గల బాలాజీ, కొండేటి రమేష్, అచ్యుత నాని, తాడి వెంకట రావు, పుప్పాల శివరామయ్య, తోట కిషోర్, మొదవ లోకేష్ తదితరులు పాల్గొన్నారు.