అంకెల గారడి తప్ప ఆచరణకు సాధ్యం కాని రాష్ట్ర బడ్జెట్.ప్రజా సంఘాల ఐక్యవేదిక
17/February/2026 07:35
Share:
ఈరోజు ప్రజా సంఘాల ఐక్యవేదిక నేత డాక్టర్ చిన్నియాదవ్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వయ్యా వుల కేశవ్ లు ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీసే విధంగా ఉందని దీనిని తీవ్రంగా నిరసిస్తున్నామని అన్నారు, మసి పూసి మారేడు, అంకెల గారడి తప్ప ఆచరణకు సాధ్యం కాని రాష్ట్ర బడ్జెట్. ఈ బడ్జెట్ను పరిశీలిస్తే సామాన్యుడికి పన్ను భారం తప్పదనే ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయని అప్పులు తెచ్చి వడ్డీలు కట్టే దౌర్భాగ్యపు ఆర్థిక విధానాన్ని ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తోందని అన్నారు,సంక్షేమం పేరుతో ఒక చేతితో ఇచ్చి పన్నుల రూపంలో రెండు చేతులతో దోచుకునే కుట్ర ఇందులో దాగి ఉందని విమర్శించారు,ఎస్సీ ఎస్టీ బీసీ లకు ఈ బడ్జెట్ లో కూడా సబ్సిడీ రుణాలు ఊసే లేకుండా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను మోసం చేసిందని అన్నారు,నిరుద్యోగ భృతి కింద యువతకు నెలకు 3000 సంగతి మరిచారని, 18 ఏళ్ల నుంచి 59 లోపు మహిళలకు ఆడబిడ్డ నిధి నుంచి నెలకి 18000 సంగతి మరిచారని,50 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నెలకి 4000 చొప్పున పెన్షన్ సంగతి మరిచారని,సున్నా వడ్డీతో మహిళా పొదుపు సంఘాలకు రూ 10 లక్షల సంగతి మరిచారని,ఒక్కొక్క రైతుకు నెలకు 3 లక్షలు చొప్పున రుణాల సంగతి మరిచారని, అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ఐ ఆర్ మెరుగైన పిఆర్సి ఇస్తామన్న సంగతి మరిచారని యాదవ్ ఆవేదన వ్యక్తపరిచారు, ఇప్పటి బడ్జెట్ గత బడ్జెట్ పరిశీలిస్తే ఏ రంగానికి నిధుల పెంపుదల లేదని, ఎంతో ప్రాముఖ్యత కలిగిన సంక్షేమ రంగంతో పాటు వ్యవసాయ రంగానికి చివరికి విద్యారంగానికి కూడా కోత పెట్టారని యాదవ్ అన్నారు, ఆచరణకు సాధ్యం కానీ అంకెల గారడీ ఈ బడ్జెట్ లో స్పష్టంగా కనిపిస్తుందని వాస్తవాలకు విరుద్ధంగా ఉన్న ఈ బడ్జెట్ వలన ఆకాంక్షల తప్ప ఆచరణ సాధ్యం కాదని, బడ్జెట్లో రెవెన్యూ ఆదాయం రూ 2.34 లక్షల కోట్లు అని ప్రభుత్వం అంచనా వేసింది కానీ ఆ మేరకు ఆదాయం రాదని నిపుణుల విశ్లేషణ ద్వారా తెలిసిందని, 2025వ సంవత్సరం రెవెన్యూ ఆదాయం 1.96 లక్షల కోట్లు అయితే ఇప్పుడు ఎంత ఎక్కువ లెక్కలు వేసుకున్న ఇప్పుడు రూ 2.15 లక్షల కోట్లకు మించదని నిపుణులు చెబుతున్నారని ఈ లెక్కన 20వేల కోట్లు ఇక్కడే తగ్గుతుంది అంటే దీనిని కూడా ఆదాయం గా భావించి పథకాలు రూపొందించడం వలన వాటి అమలుపై ప్రభావం పడుతుందని,ఇలా రాని ఆదాయాన్ని సంక్షేమ అభివృద్ధి పథకాల కోసం వినియోగిస్తున్నామని చెప్పడం వలన బడ్జెట్లో చెప్పిన చాలా పథకాలు కాగితాలకే పరిమితమయ్యే అవకాశం ఉందని యాదవ్ అన్నారు,రెవెన్యూ లోటు విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఊహజనితంగా మాట్లాడుతుందని, ఈ బడ్జెట్ చూస్తే మసి పూసి మారేడు చేస్తున్నట్టుగా ఉందని యాదవ్ అన్నారు, రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ పద్దులను సవరించకపోతే ఆందోళన చేయవలసి వస్తుందని యాదవ్ అన్నారు. ...