జాతీయ లోక్ అదాలత్ లో 1046 కేసులు పరిష్కారం యలమంచిలి: సీనియర్ సివిల్ జడ్జ్ పి. విజయ, అదనపు జానియర్ సివిల్ జడ్జి కె. రమేష్ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరిగిందని అన్నారు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో బాగంగా శనివారం 1046 కేసులు పరిష్కరించడం జరిగిందని, రాజీ పరిష్కారనిమిత్తం 56,33,312 రూపాయలు కక్షి దారులకి చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సెక్రెటరీ ఎల్ వి ఆర్ కె లాలం వెంకట రామకృష్ణారావు, లోక్ అదాలత్ సభ్యులు ప్యానల్ లాయర్లు పి సుభాషిని, పి ఆదిలక్ష్మి, నారాయణ, సోషల్ వర్కర్లు కే చిరంజీవి, ఎస్ నాగేశ్వరరావు, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది, కక్షి దారులు పాల్గొన్నారు.