కసింకోట దొంగతనం కేసులో పరారీ లో ఉన్న ముద్దాయి అరెస్ట్
07/March/2026 07:48
Share:
కసింకోట పోలీస్ స్టేషన్ – అనకాపల్లి జిల్లా 02.12.2025 తేదీన కసింకోట పోలీస్ స్టేషన్ పరిధిలోని బయ్యవరం గ్రామంలో గల శ్రీ లక్ష్మీ ఏజెన్సీలో జరిగిన దొంగతనం పై పిర్యాది దరిమిరెడ్డి దిలీప్ కుమార్ ఇచ్చిన పిర్యాదు పై కశింకోట పోలీస్ స్టేషన్ ఎస్.ఐ P మనోజ్ కుమార్ గారు కేసు నమోదు చేసినారు. అంతట సీఐ అల్లు స్వామి నాయుడు గారి ఆధ్వర్యంలో రెండు బృందాలుగా నియమించి, సదరు కేసు చేదనలో బాగంగా రెండు బృందాలు అహర్నిశలు శ్రమించి, సిసిటివి ఫూటేజ్ మరియు టెక్నికల్ డాటా ఆధారముగా, దొంగతనం చేసిన ముద్దాయి ని బత్తిన సింహాచలం @ పండు, తండ్రి రాము గా గుర్తించగా, అతని కదలికలపై నిఘా ఉంచి, ఈ రోజు అనగా 06.03.2026 తేదీన కసింకోట RTC బస్ స్టాప్ వద్ద కసింకోట పోలీస్ ఇన్స్పెక్టర్ అల్లు స్వామి నాయుడు గారి సూచనల మేరకు కె. లక్ష్మణరావు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మరియు వారి సిబ్బంది అయిన డి. గోపి, బి. శ్రీనివాసరావు, బి. మహేశ్వరరావు కలిసి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్టు సమయంలో ముద్దాయి వద్ద నుండి దొంగలించిన సొత్తు ను రూ.65,000/- నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేసు విషయంలో మరింత విచారణ కొనసాగుతోంది. ముద్దాయిని గౌరవనీయ న్యాయస్థానంలో జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం హాజరుపరచడమైనది .