ఓటు హక్కు పరిరక్షణే ధ్యేయం: బూత్-94లో వైఎస్సార్సీపీ బీఎల్‌ఏల ముమ్మర పర్యవేక్షణ.
22/June/2026 08:15
Share:
కాకినాడ జిల్లా,(క్రైమ్ న్యూస్ – రిపోర్టర్ ఆనంద్): తుని మండలం ఎస్.అన్నవరం గ్రామంలోని ఎస్సీ కాలనీ బూత్ నంబర్-94 పరిధిలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమం కొనసాగుతోంది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ తరఫున బూత్ లెవల్ ఏజెంట్లు (BLA) గుండుంపల్లి నాగరాజు, నందిక కళ్యాణ్ క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేస్తున్నారు. ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు నమోదు కావడంతో పాటు, అర్హుల పేర్లు తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తూ, ప్రజల సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హ ఓటరు జాబితాలో తన పేరు ఉందో లేదో నిర్ధారించుకోవాలని బీఎల్‌ఏలు సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో SIR కార్యక్రమం విజయవంతం అవుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటరు హక్కుల పరిరక్షణలో వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని పేర్కొన్నారు.