భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే 200వ జయంతి కార్యక్రమం

భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే 200వ జయంతి కార్యక్రమం

12/April/2026 06:55    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్.
భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ అధ్యక్షతన  మహాత్మ జ్యోతిబా పూలే 200వ జయంతి కార్యక్రమం ఆర్.ఆర్. పేట స్ఫూర్తి భవన్ నందు జరిగినది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మహాత్మ జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. జోహార్ మహాత్మ జ్యోతిబా పూలే, సాధిస్తాం జ్యోతిబా పూలే ఆశయాలను, పోరాడతాం సమాజంలో వివక్షత పోయేంత వరకు అంటూ నినాదాలు చేశారు. అనంతరం డేగా ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తనకు మార్గదర్శి, ఆదర్శప్రాయుడు మహాత్మ జ్యోతిబా పూలే అని అనేక సందర్భాల్లో చెప్పేవారని తెలిపారు. 200 ఏళ్లకు పూర్వమే ఈ సమాజంలో ఉన్న అనేక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి జ్యోతిబా పూలే అని కొనియాడారు. కార్ల్ మార్క్స్ చెప్పినట్లుగా ఎక్కడ అణిచివేత ఉంటే అక్కడ తిరుగుబాటు తీవ్రమవుతుందనట్లుగా ఆనాడు మన దేశంలోని  ప్రజలపై సనాతన ధర్మం పేరిట వివక్ష,అసమానతలు చూపేవారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు చదువుకోవడానికి వెళ్తే వారిపై పేడ నీళ్లు చల్లి,భౌతిక దాడులు చేసేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి వివక్షతలకు వ్యతిరేకంగా సామాజిక రుగ్మతలపై మహాత్మ జ్యోతిబా పూలే తన జీవిత కాలమంతా పోరాడారని తెలిపారు. జ్యోతిబాపూలే తన భార్యకు చదువు చెప్పి భారత దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయనిగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. భారతదేశవ్యాప్తంగా మహాత్మా అనే బిరుదు కేవలం ఇద్దరికీ మాత్రమే ఉందని అటువంటి గొప్ప బిరుదును పొందిన మహోన్నత వ్యక్తి జ్యోతిబా పూలే అని కొనియాడారు. ఆయన తన జీవిత కాలమంతా చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని నేడు సమాజంలో ఉన్న అసమానతలు, వివక్షత పై పోరాడాలని అదే ఆయనకు మనమంతా ఇచ్చే ఘనమైన నివాళి అని పిలుపునిచ్చారు. సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ సనాతన ధర్మం పేరిట మన దేశంలో ఆనాటి నుంచి నేటి వరకు వివక్షత, అసమానతలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్మ జ్యోతిబాపూలే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా సనాతన ధర్మంలోని అంటరానితనం,వివక్షతపై జరిపిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో మార్పు కొరకు  ఉద్యమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు.ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెళ్ళ వరప్రసాద్ మాట్లాడుతూ జ్యోతిబా పూలే భారతదేశ సమాజానికి నిరంతర స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. ఆయన సమాజంలోని అసమానతలు, వివక్షతపై చేసిన పోరాటాలను ఆదర్శంగా తీసుకోవడం, ఆయన మన ముందు వదిలి వెళ్ళిన లక్ష్యాలను పూర్తిచేసే దిశగా ఉద్యమాలను నిర్వహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో  ఏరియా సమితి కార్యవర్గ సభ్యులు, కొల్లూరి సుధారాణి, గొర్లి స్వాతి,మావూరి విజయ,బళ్ల కనక దుర్గారావు,శాయన అభిలాష్ కుమార్, ఏరియా కౌన్సిల్ సభ్యులు కొండేటి రాంబాబు, ఎం.ఏ.హకీమ్,1డివిజన్ కార్యదర్శి లక్కోజు జగదీశ్వరి,జిల్లా కౌన్సిల్ సభ్యులు భజంత్రీ శ్రీనివాసరావు, ఉప్పులూరి లక్ష్మి, భవాని,జ్యోతి,వి. విజయలక్ష్మి, ఎన్.అనంతలక్ష్మి 29 డివిజన్ ఎం.సత్యవతి, ఎం.లలిత, ఇ.లక్ష్మి,ఎస్.బుజ్జి,ఎం. సత్యవతి, పాల రామకృష్ణ, ఎర్ర వెంకటేశ్వర రావు, దాసిపల్లి ఆదినారాయణ, ఆటోనగర్ అధ్యక్షులు అరుణతార నాగేశ్వరరావు, తాళ్లూరి సురేఖ, తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter