ఈ నెల 22వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్
21/May/2026 21:01
Share:
ముమ్మరం కానున్న పారిశుధ్య పనులు.నాలుగు వారాలుపాటు జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో పారిశుధ్య పనులకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తాం.జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి.
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఈ నెల 22వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు నాలుగు వారాలు పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో " ఆపరేషన్ క్లీన్ స్వీప్" 123 పట్టణ స్థానిక సంస్థలలో ఏకకాలంలో కార్యక్రమాన్ని చేపడుతుందని తెలిపారు. అమరావతి నుండి ఏపి ముఖ్యకార్యదర్శి (పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి విభాగం) ఎస్.సురేష్ కుమార్ అధ్యక్షతన రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు,ప్రత్యేక అధికారులు, పురపాలక కమీషనర్లు మరియు ఇతర సంబంధిత అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఏలూరు జిల్లా నుండి జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఏపి ముఖ్య కార్యదర్శి (పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి విభాగం) ఎస్.సురేష్ కుమార్ మాట్లాడుతూ స్వర్ణఆంధ్ర- స్వచ్ఛఆంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో నాలుగు వారాలు పాటు ఆపరేషన్ క్లీన్ స్వీప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 22వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు నాలుగు వారాలపాటు పారిశుధ్య పనులు ముమ్మరంగా నిర్వహించాలని అన్నారు. జిల్లాలో స్వచ్ఛతను మరింత మెరుగు పరిచేందుకు పరిసరాల్లో పేరుకు పోయిన చెత్తను తొలగించాలని తెలిపారు. మొదటి వారం మే 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు వారం రోజులు పాటు రెడ్/ యెల్లో స్పాట్లు & రోడ్ల శుభ్రత కార్యక్రమం, 2వ వారంలో భాగంగా మే 29వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు వర్షపు నీటి కాలువలు, నల్లాలు & వెనుక సందులు శుభ్రం, 3వవారంలో భాగంగా జూన్ 5వ తేదీ నుండి జూన్ 11వ తేదీ వరకు నివాస, వ్యాపార ప్రాంతాలు & భారీ వ్యర్ధాలు సంస్థలు, 4వ వారంలో భాగంగా జూన్ 12వ తేదీ నుండి జూన్ 20వ తేదీ వరకు పబ్లిక్ టాయిలెట్లు & చెత్త హాట్ స్పాట్లు శుభ్రం చేసే కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. విశేషంగా ఒకే రోజు ఒకే రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో పట్టణ స్థానిక సంస్థల్లో ఏకకాలంలో నిర్వహించే అతిపెద్ద పట్టణ శుభ్రత కార్యక్రమంగా గిన్నిస్ వరల్డ్ రికార్డుకు నమోదు చెయ్యాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.