సేవా దృక్పథంతో ముందుకు సాగాలి: మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో ఏలూరు వైసీపీ ఇంచార్జ్ జేపీ పిలుపు.
06/May/2026 20:46
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు. ఏలూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి భాస్కర్ల శంకర్ (బాచి) * గారి ఆధ్వర్యంలో వేసవికాలం సందర్భంగా స్థానిక డిసిసిబి బ్యాంకు వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జీ మామిళ్ళపల్లి జయప్రకాష్ (JP) గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా JP గారు మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఏర్పాటు చేసిన బాచి గారిని అభినందించారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటువంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయుటకు ముందుకు రావాలని కోరారు.కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.