అనకాపల్లి జీవీఎంసీ. "పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం"

అనకాపల్లి జీవీఎంసీ. "పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం"

05/March/2026 15:50    Share:   

అనకాపల్లి శ్రీ వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తేదీ 5. 3.2026 న గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు అనకాపల్లి జీవీఎంసీ   టౌన్ & బాలాజిరావు పేట  ప్రైమరీ పాఠశాల నందు విద్యార్థిని, విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడినది. ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కె విష్ణుమూర్తి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో ఈఎన్టి టీ వైద్య నిపుణులు డాక్టర్ కె విష్ణుమూర్తి గారు  సుమారు 70మంది విద్యార్థిని విద్యార్థులను పరీక్షించి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా డాక్టర్ కే విష్ణుమూర్తి గారు మాట్లాడుతూ సంపూర్ణ పోషక ఆహారము తీసుకోవడం వల్ల మరియు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం  వలన అనారోగ్యం గురి కాకుండా  ఉంటారని  తెలిపారు.  పాఠశాల  ప్రధానోపాధ్యాయులు బి రామాంజనేయులు గారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు  వై రాము,బి రామలక్ష్మి, వి గౌతమీ, ఆర్ సరస్వతి, బి ఉదయ్ కుమార్ మరియు ట్రస్ట్ సిబ్బంది  బి ఈశ్వర్ రావు,  రామాజోగినాయుడు తదితరులు పాల్గొన్నారు
Breaking News

Subscribe our Newsletter