మాదకద్రవ్యాల నిర్మూలనలో విశేష సేవలకు రాష్ట్రస్థాయి "EAGLE Excellence Award"
28/June/2026 20:12
Share:
మాదకద్రవ్యాల నిర్మూలనలో విశేష సేవలకు రాష్ట్రస్థాయి "EAGLE Excellence Award" గౌరవ రాష్ట్ర హోం శాఖ మాత్యులు శ్రీమతి వంగలపూడి అనిత గారు వద్ద నుంచి అందుకున్న ఈగల్ సెల్ ఏలూరు ఆర్ఎస్ఐ బి. ఉదయ్ భాస్కర్ కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు. మాదకద్రవ్యాల నిర్మూలనలో విశేష సేవలు అందించినందుకు ఏలూరు జిల్లా ఈగల్ సెల్ ఆర్ఎస్ఐ శ్రీ బి. ఉదయ్ భాస్కర్ గారికి రాష్ట్రస్థాయి ప్రతిష్టాత్మక "EAGLE Excellence Award" లభించింది. ఈ అవార్డును ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారి చేతుల మీదుగా అందుకున్నారు. ఏలూరు జిల్లాలో డ్రగ్స్ నియంత్రణ, అవగాహన కార్యక్రమాలు, ఆపరేషన్ వజ్రపర ఆపరేషన్ గరుడ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ఆపరేషన్ ఆపరేషన్ ఈగల్ ట్రైన్స్ వంటి ప్రత్యేక ఆపరేషన్ల విజయవంతమైన అమలు, అలాగే 1972 EAGLE హెల్ప్‌లైన్ ప్రచారం మరియు నషా ముక్తి భారత్ కార్యక్రమాల సమర్థవంతమైన నిర్వహణలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ రాష్ట్రస్థాయి పురస్కారం ఏలూరు జిల్లా పోలీసు శాఖకు గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి మరింత అంకితభావంతో పనిచేయడానికి ప్రేరణగా నిలుస్తుందని ఆర్ఎస్ఐ బి. ఉదయ్ భాస్కర్ ను జిల్లా పోలీస్ అధికారులు అభినందించారు