బాలల సత్వర చికిత్స కేంద్రాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. రత్న ప్రసాద్,,

బాలల సత్వర చికిత్స కేంద్రాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. రత్న ప్రసాద్,,

25/April/2026 07:36    Share:   

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. రత్న ప్రసాద్ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాలల సత్వర చికిత్స కేంద్రాన్ని సందర్శించారు – డాక్టర్లు అందుబాటులో లేరని, పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని సూచన
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు.
రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి,ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. రత్న ప్రసాద్ ఈరోజు ఏలూరులోని  ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని జిల్లా బాలల సత్వర చికిత్స కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రత్న ప్రసాద్ మాట్లాడుతూ ఈ చికిత్స కేంద్రం పనితీరును పరిశీలించడానికి రావడం జరిగిందని అలాగే అక్కడ ఉన్న తల్లిదండ్రులతో మాట్లాడటం జరిగిందని చికిత్స కేంద్రంలో అందిస్తున్న సౌకర్యాల పైన అడిగి తెలుసుకోవడం జరిగిందని సూచించారు తదనంతరం ప్రసూతి మరియు పిల్లల వార్డులను పరిశీలించడం జరిగిందని, తనిఖీ చేసే సమయంలో డాక్టర్లు ఎవరు అందుబాటులో లేరని, నర్సింగ్ విభాగం వారు మాత్రం అందుబాటులో ఉన్నారని, ఆసుపత్రి ప్రాంగణాన్ని మరింత పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పత్రికాముఖంగా సూచించారు.
Breaking News

Subscribe our Newsletter