షరతులు లేకుండా మహిళా రిజర్వేషన్ సమలు చేయాలి.మహిళా సమాఖ్య..
03/June/2026 22:01
Share:
మహిళల రక్షణకు చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి...
ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యు)ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శి కొల్లూరి సుధారాణి.
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు. జూన్ 4వ తేదీన జరగనున్న భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యు) 72వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా 16వ డివిజన్ శాఖ కార్యదర్శి ఉప్పులూరి లక్ష్మి అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం జరిగినది. ఈ సమావేశంలో పాల్గొన్న ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శి కొల్లూరి సుధారాణి ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యు పతాకాన్ని ఎగురవేశారు అనంతరం మాట్లాడుతూ భారత జాతీయ మహిళా సమాఖ్య దేశంలోని మహిళా సమస్యల పరిష్కారం కోసం మహిళా హక్కుల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించినదని తెలిపారు. పార్లమెంట్ సభ్యురాలు,ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యు జాతీయ అధ్యక్షురాలు గీతా ముఖర్జీ ఆధ్వర్యంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని దేశవ్యాప్త ఉద్యమాన్ని నిర్వహించిన మహిళా సమాఖ్య ఎన్.ఎఫ్.ఐ.డబ్ల్యు అని కొనియాడారు. అనేక ఉద్యమాల ద్వారా పోరాటాల ద్వారా సాధించుకున్న మహిళా రిజర్వేషన్లను బేషరతుగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు ఏరియా ఉపాధ్యక్షురాలు గొర్లి స్వాతి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహిళలపై దాడులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఉప్పులూరి భవాని,రాజామణి,జ్యోతి, తాళ్లూరి సురేఖ, లక్క పాము ఝాన్సీ, పల్లి పాము సింధు, ఆలూరి వెంకట లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.