ఏలూరులో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన..*

ఏలూరులో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన..*

15/May/2026 17:33    Share:   

ఘన స్వాగతం పలికిన ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు..*
 
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి 
ఏలూరు,
 
ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం మెగా 22(ఎ) భూముల పరిష్కార వేదిక కార్యక్రమాల నిమిత్తం శుక్రవారం ఏలూరుకు విచ్చేసిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మాత్యులు, ఏలూరు జిల్లా ఇంచార్జీ మంత్రి వర్యులు, గౌరవనీయులు పెద్దలు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ఏలూరు జిల్లా కలెక్టర్ ఆఫీసులోని గోదావరి సమావేశపు మందిరం వద్ద ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ శ్రీ రెడ్డి అప్పల నాయుడు గారు ఘన స్వాగతం పలికారు.స్వాగతం పలికిన వారిలో జిల్లా కలెక్టర్ శ్రీమతి కె.వెట్రి సెల్వి,జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ,ఎమ్మెల్యే శ్రీ పట్సమట్ల ధర్మరాజు గారు,రాష్ట్ర వడ్డీల కార్పోరేషన్ చైర్ పర్సన్ శ్రీమతి ఘంటసాల వెంకటలక్ష్మి, జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ (చిన్న), జనసేన పార్టీ సీనియర్ నాయకులు నారా శేషు, మరియు పలువురు ఉన్నతాధికారులు, వివిధ హోదాల్లో ఉన్న కూటమి పార్టీల నాయకులు,కార్యకర్తలు,వీరమహిళలు జనసైనికులు ఉన్నారు..
Breaking News

Subscribe our Newsletter