మాదకద్రవ్యాల నిర్మూలలో భాగంగా పోలీసు,డాగ్ స్క్వాడ్ సంయుక్తం గా ప్రత్యేక తనిఖీలు ..!
28/May/2026 08:08
Share:
ఏలూరు మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా APSRTC ఏలూరు మెయిన్ బస్టాండ్ వద్ద ఈగల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యం లో త్రీ టౌన్ పోలీసు లు మరియు డాగ్ స్క్వాడ్ సంయుక్తం గా ప్రత్యేక తనిఖీలు మరియు అవగాహన కార్యక్రమం.
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు. ఏలూరు జిల్లా ఎస్పి శ్రీ ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ వారు ఏలూరు డిఎస్పి శ్రీ డి శ్రావణ్ కుమార్ గారి యొక్క ఆదేశాలపై మాదక ద్రవ్యాల నిర్మూలన మరియు ప్రజా భద్రత లో భాగంగా ఈ రోజు APSRTC ఏలూరు మెయిన్ బస్టాండ్ వద్ద ఈగల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 3 టౌన్ పోలీసులు మరియు డాగ్ స్క్వాడ్ సంయు క్తంగా ప్రత్యేక తనిఖీలు మరియు అవగాహన కార్యక్రమం నిర్వహిం చడమైనది.ఈ సందర్భంగా బస్టాండ్ ప్రాంగణం, బస్ స్టాప్ ప్రాంతాలు మరియు పరిసర ప్రాంతాలను డాగ్ స్క్వాడ్ ద్వారా క్షుణ్ణం గా పరిశీలించడం జరిగినది. అదేవిధంగా ప్రయాణికులకు డ్రగ్స్/మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, వాటి నివారణ, సమా జంపై వాటి ప్రభావం మరియు అనుమా నాస్పద వ్యక్తులు లేదా వస్తువులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందిం చాల్సిన అవసరంపై అవగాహన కల్పించడం జరిగినది. అలాగే మాదకద్రవ్యాలకు సంబంధించిన సమా చారం అందించేందుకు 1972 హెల్ప్‌లైన్ నంబర్ వినియోగించు కోవాలని ప్రజలకు సూచించడం జరిగినది.ఈ కార్యక్రమంలో APSRTC DPTO శ్రీ S.K. షబ్నమ్ గారు, 3 టౌన్ CI శ్రీ కోటేశ్వర రావు గారు, EAGLE RSI శ్రీ బి. ఉదయ భాస్కర్ గారు, నషా ముక్తి భారత్ అభియాన్ ఇన్‌చార్జ్ శ్రీ రామ్ కుమార్ గారు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.