ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి
27/February/2026 08:18
Share:
ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థుల పట్ల ప్రభుత్వం మరియు విద్యా శాఖ అధికారులు కొంత మానవతా దృక్పథంతో వ్యవహరించాలని బహుజన సమాజ్ పార్టీ అనకాపల్లి జిల్లా ఇన్చార్జి సూదికొండ మాణిక్యాలరావు విజ్ఞప్తి చేశారు రోడ్డు మీద ట్రాఫిక్ సమస్యలతో అదేవిధంగా కొన్నిసార్లు వ్యక్తిగత సమస్యలతో పరీక్షలకు హాజరు కావడానికి కొద్ది నిమిషాల సమయం ఆలస్యమైన కారణంతో చాలావరకు అనేక చోట్ల విద్యార్థినీ విద్యార్థులను పరీక్షలకు అనుమతించకపోవడం జరుగుతున్నదని దీనివలన ఆయా విద్యార్థిని విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఒక్కోసారి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు కూడా కలుగుతున్నాయని మాణిక్యాలరావు ఆవేదన వ్యక్తం చేశారు ఏడాది అంతా ఎంతో కష్టపడి శ్రమపడి చదివి పరీక్షల నిబంధనల ప్రకారం సమయానికి పరీక్షకు హాజరు కాలేకపోయిన కారణంగా వారి యొక్క విలువైన సమయం అంతా వృధా కావడమే కాకుండా వారి భవిష్యత్తు కూడా ఇబ్బందికి గురి అయ్యే ప్రమాదం ఉన్నందున దయచేసి ప్రభుత్వం విద్యాశాఖ అధికారులు విద్యార్థిని విద్యార్థులను పరీక్షా సమయానికి కొద్ది నిమిషాల పాటు ఆలస్యం అయినా సరే మన్నించి పరీక్షలకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు