ఏలూరులో గంజాయి అక్రమ రవాణా కేసు – నలుగురు అరెస్టు

ఏలూరులో గంజాయి అక్రమ రవాణా కేసు – నలుగురు అరెస్టు

17/June/2026 20:49    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు 

ఏలూరు జిల్లా పోలీసు అధికారులు తెలిపారు ఉదయం 9 గంటల సమయంలో ఏలూరు III టౌన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎస్.ఎన్.వి.వి. రమేష్ సిబ్బంది మరియు EAGLE టీమ్ సంయుక్తంగా సీతాపురం గ్రామ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో AP40 BR 9084 నంబరు గల మారుతి బాలెనో కారు మరియు దానికి ఎస్కార్ట్‌గా వెళ్తున్న AP39 DW 6944 నంబరు గల హీరో గ్లామర్ మోటార్ సైకిల్ ను ఆపి తనిఖీ చేయగా, కారులోని డిక్కీలో 18 ప్యాకెట్లలో 32 కిలోల గంజాయి నిల్వ ఉంచి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.

అరెస్టు చేసిన నిందితులు

  • బోనంగి నానాజీ (30, భుగత – ST, ధోనిపోలాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా)

  • మర్లపూడి దుర్గాప్రసాద్ (28, మాదిగ – SC, నామవరం, అనకాపల్లి జిల్లా)

  • మురుకుట్టి ఈశ్వర సాయి సతీష్ (26, యాదవ, భీమబోయినపాలెం, అనకాపల్లి జిల్లా)

  • బోనంగి సత్యనారాయణ (30, భుగత – ST, ధోనిపోలాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా)

స్వాధీనం చేసిన వస్తువులు

  • 32 కిలోల గంజాయి (18 ప్యాకెట్లు)

  • మారుతి బాలెనో కారు (AP40 BR 9084)

  • హీరో గ్లామర్ మోటార్ సైకిల్ (AP39 DW 6944)

నిందితుల పాత కేసులు

  • A-3 మురుకుట్టి ఈశ్వర సాయి సతీష్ పై:

    • క్రైం నెం.122/2024 – NDPS Act, మల్కాపురం PS

    • క్రైం నెం.176/2024 – NDPS Act, గాజువాక PS

    • క్రైం నెం.246/2025 – NDPS Act, కాశింకోట PS

  • A-4 బోనంగి సత్యనారాయణ పై:

    • క్రైం నెం.161/2020 – సెక్షన్ 188 IPC, నర్సీపట్నం టౌన్ PS

ప్రాథమిక విచారణలో నిందితులు గతంలో కూడా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు ఇతర నేర కార్యకలాపాలలో పాల్గొన్నట్లు వెల్లడైంది. గంజాయి సరఫరా నెట్‌వర్క్, కొనుగోలు–విక్రయాలకు సంబంధించిన ఇతర వ్యక్తుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది.

పోలీసులు తెలిపారు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైతే పీడీ యాక్ట్ వంటి నిరోధక చర్యలను కూడా పరిశీలిస్తామని.

ఏలూరు జిల్లా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీసులకు లేదా EAGLE బృందానికి తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

 
 
Breaking News

Subscribe our Newsletter