అచ్యుతాపురం ఘనంగా నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

అచ్యుతాపురం ఘనంగా నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

20/April/2026 21:03    Share:   

యలమంచిలి,అచ్యుతాపురం మండలం ఎస్ కే ఆర్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు యలమంచిలి నియోజక వర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్  ప్రగడ నాగేశ్వరరావు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర భూగర్భ వనరులు, గనులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు & అనకాపల్లి జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు  కొల్లు రవీంద్ర , తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర జోన్ ఇన్చార్జ్  దామచర్ల సత్య , మాజీ పార్లమెంట్ సభ్యులు పప్పల. చలపతిరావు, జిల్లా అధ్యక్షులు  బత్తుల. తాతయ్య బాబు,నియోజవర్గ శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం. కాశీ నాయుడు హాజరయ్యారు.ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి కి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు. రవీంద్ర  మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన ఘనత చంద్రబాబు నాయుడుదే అని,పేదలకు సంక్షేమ పథకాలతో పాటుగా ప్రభుత్వ అభివృద్ధి ప్రతి గడపకు చేర్చారు. అని,చంద్రబాబు నాయుడు అంటే వ్యక్తి కాదు.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన దార్శనికుడు అని,సామాన్య కుటుంబం నుండి వచ్చి అసమాన్య వ్యక్తిగా ఎదిగిన క్రమం యువతకు స్ఫూర్తిదాయకం అని,చిన్నతనంలోనే శ్రమదానం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి స్వగ్రామంలో పరిశుభ్రతకు పెద్దపీట వేశారు. అని,యూనివర్సిటీలో విద్యార్థి నాయకునిగా ఉంటూనే ప్రజా సేవ కోసం తపించి గ్రామ  అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అని,అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించారని పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడం లక్ష్యంగా నిత్యం కృషి చేశారని,నాయకుడు అంటే ఈ రోజు అవసరాలు తీర్చడం కాదు రాష్ట్ర భవిష్యత్ అవసరాలు పరిష్కరించాలి..అందుకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించిన నాయకుడు అని,48 సంవత్సరాల రాజకీయ జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొన్నారు అని,ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పటికీ ఓటమిని ఒప్పుకోకుండా గెలుపు కోసం అలుపెరుగక శ్రమించడం కార్యదక్షతకు నిదర్శనం అని,ఎన్ని అవమానాలు, అపవాదులు ఎదుర్కొన్నా రాష్ట్రం కోసం ఎప్పుడూ ఆలోచించారు అని,రూ.16 కోట్ల విలువైన ఇంజెక్షన్ అందించి పునర్వికకు పునర్జన్మ ఇవ్వడంలో నారా లోకేష్  కృషికి తోడుగా నిలిచిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని,సహాయ నిధి ఆర్థిక సాయం నిదర్శనం అని,నిత్యం రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల బాగు కోసం శ్రమించే నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా మన కోసం పని చేసేలా చూడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. అనంతరం పార్టీ కష్టకాలం సమయంలో సర్పంచులుగా గెలుపొందిన వారికి సన్మానం చేసారు.ఈ కార్యక్రమంలో యలమంచిలి నియోజకవర్గ పరిశీలకులు బోండా. జగన్నాథం, రాజాన. రమేష్ కుమార్,ధూళి. రంగనాయకులు, మండల అధ్యక్షులు పీల. తులసీరామ్, లాలం భరత్, ఇత్తంశెట్టి సన్యాసినాయుడు,పెంటకోట విజయ్, గొర్లి శివన్నారాయణ మూర్తి, తెలుగు మహిళా అధ్యక్షురాలు ఆడారి. మంజు , గవర కార్పోరేషన్ డైరెక్టర్ భీమరశెట్టి. శ్రీనివాసరావు, మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ డొక్కా‌ నాగభూషణం, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మామిడి. శివ అప్పారావు,కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter