ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: నిర్ణీత సమయంలో అర్జీలను పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి .

ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: నిర్ణీత సమయంలో అర్జీలను పరిష్కరించాలి - జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి .

28/April/2026 07:02    Share:   

ప్రజా సమస్యలు పరిష్కారంలో అధికార్లు ప్రత్యేక దృష్టి పెట్టాలి.ప్రతి అర్జీని క్షుణ్ణంగా అధ్యయనం చేసి నిర్ణీత సమయంలోగా పరిష్కారం చూపాలి.జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ...
పిజిఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్ లలో వచ్చిన అర్జీలు 203. 
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు, 
జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజాసమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లాస్థాయీ అధికారులతో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి నిర్వహించారు. జిల్లా కలెక్టరుతో పాటు జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె.అభిషేక్ గౌడ,ట్రైనీ ఐఏయస్ చింతకింది శ్రావణ్ కుమార్ రెడ్డి, ఇంచార్జి జిల్లా రెవెన్యూ అధికారి యల్.దేవకీదేవి, ఇంచార్జి ఆర్డీవో ఐ.కిషోర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టరు కె.భాస్కర్, ఎస్సీ కార్పొరేషన్ ఇడి యం.ముక్కంటిలు అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ అర్జీదారులతో  మర్యాద పూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలు ఓర్పుతో విని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమస్యలను త్వరగా పరిష్కరించడమే అధికారులు ప్రధమ బాధ్యత అని అన్నారు. అర్జీలు పెండింగులో ఉండకుండా చూసుకోవాలని, పరిష్కార ప్రక్రియలో పారదర్శకత ఉండాలని అన్నారు. ప్రజలు సమర్పించే ప్రతి ఫిర్యాదుపై బాధ్యతగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజలు సమస్యలను పరిష్కరించే సమయంలో శాఖలు మధ్య సమన్వయం అత్యంత అవసరమని జిల్లా కలెక్టరు పేర్కొన్నారు. భూమి వివాదాలు, సంక్షేమ పథకాలు, ఆదాయ ధృవపత్రాలు, పింఛన్లు వంటి అంశాలుపై వచ్చిన అర్జీలను ప్రాధాన్యతతో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారంలో ఎటువంటి నిర్లక్ష్యం చూపకూడదని, సమస్యలు పరిష్కారంలో ఆలస్యం జరిగితే సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని అన్నారు.
కొయ్యలగూడెం మండలం గవరవరం గ్రామ నివాసి ఈర్లగడ్డ చంద్ర నా రిజిస్టేషన్ స్థలాన్ని ఆక్రమణకు గురైంది అని విచారణ చేసి నా భూమిని ఇప్పించాలని కోరారు, ఏలూరు - వైయస్ఆర్ కాలనీ నివాసి మిడతా నాగరాజు మా వీధిలో వీధికుక్కలు బెడద చాలా ఎక్కువగా ఉందని పరిష్కారం చెయ్యాలని కోరారు, కైకలూరు మండలం కైకలూరు చెందిన పి.టి.వి. పెద్దిరాజు గ్రామ పంచాయతీకి కొన్ని వర్కులు చేసియున్నానని, బిల్లులకు సొమ్ములు చెల్లించాలని కోరారు, నూజివీడు మండలం ముక్కొల్లుపాడు చెందిన తోట రామప్రసాదు నా భూములకు కొలతలు, సరిహద్దులు నిర్ణయించాలని కోరారు, రెవిన్యూ క్లినిక్ లు మండలాలు వారీగా ప్రత్యేక  కౌంటర్లు ఏర్పాట్లు చేసి అర్జీలను స్వీకరించారు. వీటిలో భూసేకరణ సంబంధిత సమస్యలు, ఆర్ఓఆర్ పట్టాదారు పాసు పుస్తకాలు, రీ సర్వే తిరిగి చెయ్యాలని, తదితర ఇతర భూసమస్యలు ఉన్నాయి.ఈ కార్యక్రమంలో వివిధ శాఖలు జిల్లా అధికారులు, జిల్లా కలెక్టరేటు ఏవో యన్.వి.నాంచారయ్య, జిల్లా కలెక్టరేటు సూపర్డెంట్లు, తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter