‘జీరో కార్బన్’లక్ష్యం : పర్యావరణ పరిరక్షణే మానవాళి మనుగడ..!

‘జీరో కార్బన్’లక్ష్యం : పర్యావరణ పరిరక్షణే మానవాళి మనుగడ..!

04/June/2026 16:21    Share:   

నిర్లక్ష్యం వహిస్తే వినాశనమే!
డా. ఎం. ఆర్. ఎన్. వర్మ, సీనియర్ జర్నలిస్ట్, విశాఖపట్నం 
ప్రకృతిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది -ఇప్పటివరకు వివిధ కారణాలతో మానవ సమాజం ఐదు మహా ఉపద్రవాలు,వాటి నష్టాలు,కష్టాలు చూసింది.రాబోతున్న ఆరవ మహా ఉపద్రవం,దీనికి కార్బన్ డయాక్సైడ్ మూల కారణం.ఇదే జరిగితే దాదాపు బిలియన్ అరుదైన జాతులు అంతరించిపోతాయి.ఇప్పటికే దాదాపు పదివేల రెట్లు కనుమరుగవుతూ వస్తున్నాయి. నాగరికత పేరుతో, ఆధునీకరణ పేరుతో బొగ్గు, గ్యాస్, ఆయిల్ లాంటి అనేక విపరీత కార్బన్ డయాక్సైడ్ కారకాలైనటువంటి వాటిని నిత్య జీవితంలో రాత్రి పగలు పరిశ్రమల పేరుతో, రవాణా పేరుతో వాడుతున్నాం.మనదేశంలో పారిశ్రామిక విప్లవానికి ముందు 218 పి పి యం ( పొల్యూషన్ పర్ మిలియన్ ) ఉండేటువంటి కార్బన్ డయాక్సైడ్, తద్వారా కాలుష్య ప్రభావం నేడు 433 పి పి యం ప్రమాద స్థాయికి   చేరుకుంది.  గ్లోబల్ వార్నింగ్ లో కారణాలు ఎన్ని ఉన్నా 50% పైగా కార్బన్ డయాక్సైడ్ కీలకంగా ప్రభావితం చూపుతుంది . అందువలన కార్బన్ డయాక్సైడ్ ద్వారా ఎదురయ్యే ముప్పు నుండి బయట పడేందుకు ప్రభుత్వాలు కార్బన్ లాకర్లను సిద్ధం చేయాలి, కార్బన్ ఎనర్జీని ఒక సోర్స్ గా, రీసైకిలింగ్ ఉపయుక్తంతో మార్కెట్ వస్తువుగా తయారు చేసే పరిశోధనలు, వ్యాపారాలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. గ్రీన్ కవర్,  గ్రీన్ పవర్,  గ్రీన్ టెక్నాలజీ యుద్ధ ప్రాతిపదికన వాడుకల్లోకి తేవాలి. మానవాళి మనుగడకు 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా జీరో కార్బన్ చేయాలనేది అంతర్జాతీయ సంస్థల నిర్ణయం. రాబోయే రోజుల్లో కార్బన్ క్రెడిట్, కార్బన్ ట్రేడింగ్, కార్బన్ ఫైనాన్స్ లాంటివి రావాలి. పర్యావరణానికి  తీవ్ర విఘా తంగా ఉన్నటువంటి కార్బన్ వ్యర్థ పదార్థం కాదు బేకింగ్ సోడా లాంటి సాలిడ్, యూరియా తయారీకి, చల్లదనానికి ఉపయోగించే డ్రై ఐస్  తరహా మార్కెట్ కమర్షియల్ సోర్స్ గా అవసరమైతే సూర్యశక్తిని జోడించి సర్కులర్ ఎకానమీలా పునర్ ఉత్పత్తికి నూతన ఆవిష్కరణలు జరగాలి.గ్రీన్ కవర్, గ్రీన్ పవర్, గ్రీన్ టెక్నాలజీ పర్యావరణానికి శ్రీరామరక్ష.  "ప్రకృతిని మనం కాపాడడం లేదు.. పకృతే మనల్ని ఇన్నాళ్లు కాపాడుతుంది" అనే నిజం తెలుసుకొనే రోజు ఇ ది.. మొక్కలు నాటడం మంటే మనల్ని మనం రక్షించుకోవడమే 
పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం ఒక్క మొక్క నాటక పోయినా పర్వాలేదు కానీ ఒక్క ప్లాస్టిక్ కవర్ వాడకుండా, ఒక్క ముద్ద అన్నం వృధా చేయకుండా ఉంటామనేది ప్రామాణికంగా పెట్టుకోవాలి. పర్యావరణాన్ని కాపాడడానికి మనం హీరోలు అవ్వక్కర్లేదు. మన పని మనం నిజాయితీగా, నేలకు హాని చేయకుండా చేస్తే చాలు. ప్రతి ఏడాది జూన్ 5 వస్తే చాలు స్కూలు పిల్లలతో మొక్కలు నాటిస్తాం, ఫోటోలు దిగుతాం, సోషల్ మీడియాలో పెడతాం.  మరుసటి రోజుకి ఆ మొక్కకు నీళ్లు పోసే నాధుడు ఉండడు, ఇది కాదు పర్యావరణ దినోత్సవం అంటే. చెట్లు నాటడం మే కాదు.. వాటి ద్వారా,మనల్ని మనం సంరక్షించుకుంటున్నామనే సంకల్పంతో ముందుకెళ్లాలి. ప్రపంచంలో పర్యావరణ పరిరక్షణలో అగ్రస్థానంలో ఉన్న దేశంలో డేన్మార్క్. తర్వాత స్థానంలో యూకే, స్వీడన్ ఫిన్లాండ్, మాల్టా లాంటి దేశాలు ఉన్నాయి.డెన్మార్క్ దేశంలో పునరుత్పాతక ఇందన లక్ష్యంగా పెట్టుకున్నారు. 2030 నాటికి బొగ్గు, చమురు పూర్తిగా బంద్ చేయాలనే లక్ష్యం తో ఆ దేశం లో చర్యలు తీసుకున్నారు.2024 నాటికే 67 శాతం విద్యుత్తు సహజ సిద్ధంగా గాలి మరలు, సోలార్ నుంచే  వాడటం మొదలు పెట్టారు.గ్రీన్ టాక్స్ విధానం  సైకిలు,ఎలక్ట్రికల్ వాహనాలు వాడితే  ప్రభుత్వం ప్రజలకు డబ్బు చెల్లిస్తుంది. ఇక్కడ ఫుడ్ వేస్ట్ చట్టం ఉంది. ఆహారం వృధా చేస్తే నేరంగా పరిగణిస్తారు. 2030 దేశంలో వ్యవసాయ భూమి 25 శాతం ఆర్గానిక్ భూమిగా లక్ష్యం. బలంగా క్లైమేట్ యాక్ట్ పనిచేస్తుంది. డెన్మార్క్ పర్యావరణంలో  మొదటి స్థానంలో ఉండడానికి కారణం ప్రజలు, ప్రభుత్వం, ప్రవేట్ యజమాన్యాలు కలిసి సంయుక్తంగా పర్యావరణకు పరిరక్షణ కు కృషి చేస్తారు. 2025 నాటికీ వివిధ అధ్యయన సంస్థల అంతర్జాతీయ నివేదికల ప్రకారం ప్రపంచంలో 40 శాతం వ్యవసాయ భూమి ఇప్పటికే ఎరువులు, రసాయనాలు, క్రిమిసంహారకాలు వాడటంతో"డెడ్ సాయిల్ "గా అయిపోయింది నివేదికలు చెబుతున్నాయి. రసాయన ఎరువులు పురుగుల మందులు వాడకం వల్ల నేలలో సూక్ష్మజీవులు లేని పరిస్థితి.కొసమెరుపు : అభివృద్ధి అవసరమే, అభివృద్ధికి ఎవరు వ్యతిరేకం కాకూడదు. అభివృద్ధి పేరుతో ఎవరి లక్ష్యాలను నెరవేరుస్తాం అనేది ముఖ్యం. ఉత్తరాంధ్రలో విశాఖ కేంద్రంగా శర వేగంగా వస్తున్న డేటా సెంటర్లు పై గ్రీన్ టెక్నాలజీ ఉపయోగించి మనకు కానీ, మన భావితరాలకు కానీ లాభం, ఉపయుక్తం  కాక పోయినా పర్వాలేదు కానీ,   పర్యావరణ నష్టాలు, కష్టాలు రాకుండా చూడాలి. రాబోయే తరాల పర్యావరణ ప్రయోజనాలు ఫణంగా పెట్టకూడదు. దీనిపైన జాతీయ, రాష్ట్రం తో పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయం నిపుణులతో కమిటీ ఏర్పాటుచేసి క్షేత్రస్థాయిలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల  ఇపిఐ లెక్కల్లో 2024  నాటికి భారత దేశం 176 స్థానంలో ఉంది. దేశం, రాష్టం ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి, కలుషితం కాకుండా కాపాడుకోవాలి. ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతులకు ఎక్కువ సబ్సిడీ, సరళ తర తక్కువ వడ్డీతో రుణాలు,  శిక్షణ ప్రభుత్వం లక్ష్యం కావాలి. మనకున్నటువంటి సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.ఉత్తరాంధ్రకు పర్యావరణమే ప్రాణం ఒకపక్క సహజ సిద్ధమైన తూర్పు కనుమలు, మరోపక్క నదులు, సుదూర సముద్ర తీర ప్రాంతం, అడవులు ఇలా ప్రకృతి తో మమేకమైన ప్రాంతం ఉత్తరాంధ్ర . అయితే ఉత్తరాంధ్రలో  పర్యావరణ పరిరక్షణకు పలు చర్యలు చేపట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.తీర ప్రాంతం కోతకు గురి కాకుండా "మడ అడవులను" పాయకరావుపేట మొదలు ఇచ్చాపురం వరకు పెంచాలి.దీనికి తోడుగా తీరప్రాంతాల్లో సరుగుడు చెట్టు కూడా  యుద్ధ ప్రాతిపదికన  పెంచాలి. దీనికి మత్స్యకార కుటుంబాల ఉపాధిగా మడ అడవులు, సరుగుల చెట్టు పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సహించాలి.  మనకు అవసరం లేని, ఎవరికో ఆర్థికంగా ఉపయోగపడేటువంటి బాక్సైట్ లాంటి వివిధ ఖనిజ తవ్వకాలను పూర్తిగా నిషేధించాలి. గాలి కాలుష్యానికి కారకాలవుతున్న వాటిని గుర్తించాలి. ఇప్పటికే ఉత్తరాంధ్రలో విశాఖపట్నం లో డేంజర్ బెల్స్ స్థాయికి చేరింది. తీవ్ర కాలుష్యానికి కారణం అవుతున్న పరిశ్రమలను చిత్తశుద్ధితో నియంత్రించాలి. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ నిబంధనలు పాటించి, వివిధ ఫార్మా కంపెనీల ద్వారా  కలుషిత నీటి  ప్రభావం లేకుండా చేయాలి.వంశధార, నాగావళి, చంపావతి, శారద, గోస్తనీ లాంటి నదులు పుట్టినిల్లు ఉత్తరాంధ్ర. వీటి వద్ద అక్రమ ఇసుక తవ్వకాలకు, తీర ప్రాంతాలు ఆక్రమణలకు  గురికాకుండా చూడాలి. గ్రామాల్లో మురుగు శుద్ధి కుంటలు ఏర్పాటు చేసి  తామర మొక్కలు పెంచే దిశగా చర్యలు ఉండాలి. వాన నీటిని ఒడిసిపట్టే ఇంకుడు గుంతలు తప్పనిసరి చేయాలి. దీనికి 90 శాతం సబ్సిడీ ప్రకటించాలి.ప్లాస్టిక్ నిషేధం నిబంధనను చిత్తశుద్ధి అమలు చేయాలి. అసలు ప్లాస్టిక్ ఉత్పత్తి చేసే పరిశోధన మీద మార్కెటింగ్ చేసి వ్యాపారం చేసే సంస్థల్ని నిరోధించాలి. నేటి తరాలకు ఒక విద్యార్థి ఒక మొక్క నాటి,పది సంవత్సరాల పాటు ఆ చెట్టు ఆలనా పాలన చూస్తే ఆ విద్యార్థికి పదో తరగతిలో అదనపు మార్కులు ఇస్తామన్న నిబంధన తీసుకురావాలి.ఆర్గానిక్ పండ్లను ఆర్గానిక్ కూరగాయలను ఆర్గానిక్ చిరుధాన్యాలను విస్తృతంగా ప్రోత్సహించాలి.
Breaking News

Subscribe our Newsletter