అగ్ని ప్రమాదాలు నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి..!

అగ్ని ప్రమాదాలు నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి..!

20/April/2026 14:24    Share:   

అగ్ని ప్రమాదాలు నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి..! అగ్నిమాపక శాఖ అధికారి రాంబాబు..!!
క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్ యలమంచిలి:
అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరమని యలమంచిలి అగ్నిమాపక శాఖ అధికారి రాంబాబు సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా యలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బందికి ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయి, వాటిని ఎలా నివారించాలి, ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అనే అంశాలపై సిబ్బందికి వివరంగా అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఎలక్ట్రికల్ పరికరాల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించాలని సూచించారు.అదేవిధంగా యలమంచిలి రైల్వే స్టేషన్ రోడ్డులోని ప్రముఖ విజ్జు డెంటల్ క్లీనిక్‌లో డాక్టర్ పెనుగంటి సింహాద్రి నాయుడు, సునీత మరియు ఇతర వైద్యులు, సిబ్బందికి కూడా అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్లు, హాస్పిటల్ సిబ్బంది, అగ్నిమాపక శాఖ సిబ్బంది పాల్గొని అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంపొందించుకున్నారు.
Breaking News

Subscribe our Newsletter