చీపురుపల్లి మండల పరిషత్ అధ్యక్షురాలిగా ఎన్డీఏ కూటమి మద్దతుతో దన్నాన పద్మావతి ఎన్నికయ్యారు. గురువారం చీపురుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో ఆమె అధికారికంగా మండల పరిషత్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది.ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొని దన్నాన పద్మావతికి అభినందనలు తెలిపారు. మండల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేయాలని నాయకులు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆర్వో తహసీల్దార్ నాయుడు, ఎంపీడీవో అధికారులు, మండల ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పద్మావతి ఎన్నిక పట్ల కూటమి శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి.
క్రైమ్ ఎనాలసిస్ విజయనగరం జిల్లా ఇంచార్జ్ మందపాటి సూర్యనారాయణ రాజు