గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం
17/November/2026 20:08
Share:
- ఎంపీడీవో వి. దీపిక
యలమంచిలి : మండలంలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియపై ఎన్నికల అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు యలమంచిలి మండల ఎన్నికల అధికారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి వి. దీపిక తెలిపారు. మంగళవారం ఉదయం 10 గంటలకు యలమంచిలి మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ విస్తరణ అధికారి గిరిప్రసాద్, శిక్షణాధికారులతో కలిసి ఆర్.ఓ, ఏ.ఆర్.ఓ లుగా నియమితులైన అధికారులకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నామినేషన్ పత్రాల స్వీకరణలో అధికారులు పాటించాల్సిన విధివిధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. అనంతరం గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేయు అభ్యర్థులకు అవసరమైన నామినేషన్ ఫారాలు, ఇతర సామాగ్రిని అధికారులకు అందజేశారు. రేపటి అనగా బుధవారం నుండి మండల పరిధిలోని గుర్తించిన 8 నామినేషన్ కేంద్రాల్లో నామినేషన్ల స్వీకరణ అధికారికంగా ప్రారంభం కానున్నట్లు ఎంపీడీవో తెలిపారు. ఏటికొప్పాక, బయ్యవరం, పులపర్తి, కృష్ణాపురం, పోతిరెడ్డిపాలెం, పురుషోత్తపురం, లైన్ కొత్తూరు, షైకల్లపాలెం స్టేజ్ 1 అభ్యర్థులు, సంబంధిత నామినేషన్ కేంద్రాల అధికారులు ఈ సద్వినియోగం చేసుకోవాలని, నిబంధనల ప్రకారం ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.