అచ్చుతాపురం భగత్ సింగ్ 119వ జయంతి వేడుకలు ఈ సందర్భంగా CITU జిల్లా కార్యదర్శి ఆర్. రాము మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం అతి తిన్న వయసులోనే భగత్ సింగ్ బ్రిటిష్ వారి చేతిలో ఉరి తీయబడి తన ప్రాణాలను తృణ ప్రాయంగా అర్పించారని భగత్ సింగ్ కలలు కన్న దోపిడీ లేని సమాజం కోసం పోరాడాలని నేటికీ అందరికీ ఉపాధి ,విద్య, వైద్యం అందని ద్రాక్షల ఉందని పోరాడి సాధించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పెట్టుబడిదారులకి అప్పగిస్తుందని దీంతో నిరుద్యోగ సమస్య తీవ్రం అవుతుందని దీనిపై జన్ జి యువత ప్రభుత్వ విధానాలపై పెద్ద ఎత్తున పోరాటం చేసిందని నేటి ప్రస్తుత ఎలక్షన్ కమిషన్ దేశంలో పౌరుల ఓట్లను తొలగించే ప్రక్రియ ఎస్ ఐ ఆర్ ని తీసుకొచ్చి ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తుందని రాజకీయాలకతీతంగా వ్యవహరించవలసిన ఎలక్షన్ కమిషనర్ బిజెపికి వంత పాడడం దుర్మార్గమని వీరిని వెంటనే విధుల నుండి తొలగించాలని కోరుతూ, యువత ప్రతిజ్ఞ చేశారు కొత్తూరు యూత్ పాము రమణ, కిల్లాడి చిన్న, శెట్టి చిన్న, నాగ, మత్స్య కార్మిక సంఘం నాయకులు చేపల తాతయ్య తదితరులు పాల్గొన్నారు.