పార్టీ బలోపేతమే లక్ష్యంగా టిడిపి నాయకుల పిలుపు క్రైమ్ అనాలిస్ (రిపోర్టర్ ఆనంద్)
అనకాపల్లి ఎలమంచిలి నియోజకవర్గం పరిధిలోని పురుషోత్తపురం గ్రామంలో టిడిపి మహానాడు 2026 వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ విజయబాబు, మాజీ సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొని పార్టీ జెండాలతో గ్రామాన్ని పసుపుమయం చేశారు. మహానాడు కార్యక్రమం పార్టీ బలోపేతానికి, కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపేందుకు కీలక వేదికగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బజంత్రీల లక్ష్మి, సర్పంచ్ కుమారుడు శ్రీను, వైస్ సర్పంచ్ కర్రి సింహాచలం, ఊడి రామకృష్ణ, పెదపాటి శరత్, దేవరపు మోహన్, దారా పోలిశెట్టి, పోలుమూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో టిడిపి కార్యకర్తలు హాజరై మహానాడు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.