*అంగన్వాడీలకు కనీస వేతనం  26000 డిమాండ్*

*అంగన్వాడీలకు కనీస వేతనం 26000 డిమాండ్*

25/February/2026 15:53    Share:   


అంగనవాడి  టీచర్లకు,కనీస వేతనం 26000,  ఆయాలకు, 20000 పెంచాలని, పెండింగ్ఉన్న 1810 మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్స్ చేసి మెయిన్ సెంటర్ గా మార్చాలని,  చట్టబద్ధమైన గ్రాట్యూటీ అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలని హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని  కోరుతూ అంగనవాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్( సిఐటియు) ఆధ్వర్యంలో యలమంచిలి అంగన్వాడి ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడి కార్యకర్తలు రిలే దీక్ష నిర్వహించారు 
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జి దేవుడి నాయుడు, అంగనవాడి ఎలమంచిలి ప్రాజెక్ట్ లీడర్ బి శశికళ, కే ఎం ఎస్ జయ మాట్లాడుతూ నేటి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీల సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు విస్మరించి అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకపోగా యాప్లు భారంతో పని ఒత్తిడిని పెంచుతున్నాయని 24 గంటలు యాప్స్ తోనే సరిపోతుంటే ఎప్పుడు పిల్లలకి చదువు చెప్పాలని ప్రశ్నించారు ధరల విపరీతంగా పెరుగుతున్నప్పటికీ అంగన్వాడీల జీతాలు మాత్రం పెంచడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు అచ్చుతాపురం రాంబల్లి మండల కన్వీనర్లు కె సోము నాయుడు సిహెచ్ రామకృష్ణ పి అంజలి ఏ అన్నపూర్ణ బి సంతోష్ వై యమునా కే విజయలక్ష్మి కె కుసుమకుమార్ ఆర్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు
Breaking News

Subscribe our Newsletter