యలమంచిలిలో ‘హంసఫర్’ ఎక్స్‌ప్రెస్‌కు ఘనస్వాగతం: జెండా ఊపి ప్రారంభించిన మాజీ ఎంపీ పప్పల చలపతిరావు

యలమంచిలిలో ‘హంసఫర్’ ఎక్స్‌ప్రెస్‌కు ఘనస్వాగతం: జెండా ఊపి ప్రారంభించిన మాజీ ఎంపీ పప్పల చలపతిరావు

13/April/2026 22:06    Share:   

యలమంచిలి: కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు చొరవతో శ్రీకాకుళం రోడ్ - తిరుపతి మధ్య నడిచే హంసఫర్ ఎక్స్‌ప్రెస్‌కు యలమంచిలి రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా సోమవారం యలమంచిలి స్టేషన్‌కు చేరుకున్న రైలుకు కూటమి నాయకులు ఘనస్వాగతం పలికారు.ముందుగా మాజీ పార్లమెంట్ సభ్యులు పప్పల చలపతిరావు ప్రయాణికులకు పూలగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం జెండా ఊపి రైలును ముందుకు సాగనంపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు యలమంచిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, ఉత్తరాంధ్ర జనసేన వ్యవహారాల ఇంచార్జ్ సుందరపు సతీష్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ పిల్లా రమా కుమారి తదితరులు పాల్గొన్నారు.స్థానిక ప్రజల రవాణా అవసరాలను గుర్తించి, రైలు నిలుపుదలకు సహకరించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఈ సందర్భంగా నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter