జన్మదినం వంటి శుభకార్యాల వేళ ఆడంబరాలకు పోకుండా ఇలా మొక్కలు నాటడం అబినందనియం..

జన్మదినం వంటి శుభకార్యాల వేళ ఆడంబరాలకు పోకుండా ఇలా మొక్కలు నాటడం అబినందనియం..

11/May/2026 20:58    Share:   


యలమంచిలి
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని చాటిచెబుతూ, అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు కొక్కిరాపల్లి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామ జ్యోతి యువత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కొక్కిరాపల్లి గ్రామానికి చెందిన దంపతులు శ్రీ అలవల అప్పారావు, శ్రీమతి లక్ష్మిల చిన్న కుమారుడు హేమచంద్ర జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గ్రామ ప్రధాన మార్గంలో యువత మరియు గ్రామ పెద్దల సమక్షంలో మొక్కలు నాటారు.

గ్రామాభివృద్ధిలో భాగస్వాములవుతూ, పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయడం పట్ల గ్రామ జ్యోతి యువత సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. జన్మదినం వంటి శుభకార్యాల వేళ ఆడంబరాలకు పోకుండా ఇలా మొక్కలు నాటడం ఎంతో అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అప్పారావు దంపతులను యువత సభ్యులు ప్రత్యేకంగా అభినందించి, హేమచంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ జ్యోతి యువత సభ్యులు, గ్రామ పెద్దలు మరియు స్థానికులు పాల్గొన్నారు.
 
Breaking News

Subscribe our Newsletter