ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం చేయాలి..! సుందరపు విజయ్ కుమార్..!!

ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం చేయాలి..! సుందరపు విజయ్ కుమార్..!!

27/May/2026 20:50    Share:   

క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ :
జనవాణి కార్యక్రమానికి వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను అధికారులు సత్వరమే పరిష్కరించి, వారికి న్యాయం చేకూర్చే విధంగా పనిచేయాలని స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ సూచించారు.
బుధవారం ఎమ్మెల్యే చాంబర్‌లో ఏర్పాటు చేసిన ‘జనవాణి’ కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి స్వయంగా వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా సమస్యల అర్జీలను ఆయా శాఖల అధికారులకు అందజేస్తూ ఎమ్మెల్యే విజయ్‌కుమార్ మాట్లాడారు.
ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆశతో జనవాణికి వస్తారని, ఇక్కడికి వచ్చిన వారు మళ్లీ అదే సమస్యపై రెండోసారి కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రాకూడదని స్పష్టం చేశారు. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి, వచ్చిన పనులను తక్షణమే పూర్తి చేసి పంపించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు కూటమి నాయకులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter