రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని రక్షించిన పోలీసులు..!!

రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తిని రక్షించిన పోలీసులు..!!

14/May/2026 14:48    Share:   

 
క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ - ఉత్తరాంద్ర జోనల్ ఇంచార్జ్ :
 
విశాఖపట్నం నగరంలో రైల్వే ట్రాక్‌పై పడుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు సమయానికి స్పందించి కాపాడారు. నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత భాగ్చి, ఐపీఎస్ ప్రజలకు అందుబాటులో ఉంచిన హెల్ప్‌లైన్ నంబర్ 7995095799 కు ఓ వ్యక్తి ఫోన్ చేసి సమాచారం అందించారు.
ఈ సమాచారం అందుకున్న వెంటనే సీపీ ఆదేశాల మేరకు రైల్వే పోలీసులు అప్రమత్తమై, విశాఖ రైల్వే స్టేషన్ 8వ ప్లాట్‌ఫామ్ సమీపంలోని ట్రాక్ వద్దకు చేరుకుని ఆ వ్యక్తిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
తర్వాత బాధితుడికి కౌన్సెలింగ్ నిర్వహించగా, తక్షణ స్పందనతో ప్రాణాలు కాపాడినందుకు బాధితుడి కుటుంబ సభ్యులు నగర పోలీస్ కమిషనర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Breaking News

Subscribe our Newsletter