మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఎస్సై దినకర్..!

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఎస్సై దినకర్..!

06/June/2026 18:16    Share:   

క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ :
యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని రాంబిల్లి ఎస్సై దినకర్ సూచించారు. మండలంలోని వాడ నరసాపురం గ్రామంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
మత్స్యకార గ్రామమైన వాడ నరసాపురం యువత విద్య, ఉపాధి, క్రీడలు తదితర రంగాల్లో ముందంజలో ఉందని, అదే స్ఫూర్తితో ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మద్యం, సిగరెట్లు, గుట్కా, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడితే వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబ భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.
మత్తు పదార్థాల వినియోగం వల్ల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు కుటుంబ గౌరవం, ఆర్థిక పరిస్థితి కూడా ప్రభావితమవుతుందని వివరించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును సక్రమంగా నిర్మించుకోవాలని, సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.
అలాగే మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులు కూడా చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని స్పష్టం చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేయడంతో పాటు సంబంధిత తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని, డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చింతకాయల ఎర్రయ్య, మాజీ ఎంపీటీసీ చెల్లూరి దేముడు, జనసేన నాయకుడు నాని, గ్రామ పెద్దలు, యువకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter