స్థానిక సంస్థలలో బిసిలకు జనాభా నిష్పత్తి మేర రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి– జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ

స్థానిక సంస్థలలో బిసిలకు జనాభా నిష్పత్తి మేర రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి– జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ

11/June/2026 20:21    Share:   

స్థానిక సంస్థలలో బిసిలకు జనాభా నిష్పత్తి మేర రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి– ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ ప్రసాదు కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్థానిక సంస్థలలో వెనుకబడిన తరగతులు (BCs)కు వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ ప్రసాదు, స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం చేస్తున్న ప్రత్యేక కమిషన్ చైర్మన్ శ్రీ రాజీవ్ రంజన్ మిశ్రాకు, గురువారం  వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ మాట్లాడుతూ వెనుకబడిన తరగతులు రాష్ట్ర జనాభాలో గణనీయమైన శాతం కలిగి ఉండటమే కాకుండా వ్యవసాయం, సంప్రదాయ వృత్తులు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యాపారం, సేవారంగం తదితర రంగాలలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, రాజకీయంగా మరియు సామాజికంగా తగిన ప్రాతినిధ్యం పొందలేకపోతున్నారని పేర్కొన్నారు. స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి సుప్రీంకోర్టు నిర్దేశించిన “ట్రిపుల్ టెస్ట్” ప్రక్రియ కేవలం ఒక విధాన పరమైన ప్రక్రియగా కాకుండా, బీసీల సామాజిక న్యాయం మరియు రాజకీయ సాధికారతను బలోపేతం చేసే సాధనంగా ఉపయోగపడాలని ఆమె అభిప్రాయపడ్డారు. కమిషన్ పరిశీలన కోసం ఆమె ప్రధానంగా ఈ క్రింది అంశాలను ప్రతిపాదించారు.
Breaking News

Subscribe our Newsletter