అనకాపల్లి:
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని 'సర్వేజన ఐక్యవేదిక' ఆధ్వర్యంలో, కోరిబిల్లి పరి సారధ్యంలో ఏర్పాటు చేసిన 'రక్తదాత-ప్రాణదాత' రక్తదాన శిబిరాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ దాడి రత్నాకర్ గారు ప్రారంభించారు.
ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి దాడి రత్నాకర్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను స్మరించుకుంటూ, సామాజిక బాధ్యతతో ఇలాంటి రక్తదాన శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
అనంతరం రక్తదానం చేసిన యువకులను ఆయన ప్రత్యేకంగా అభినందిస్తూ, వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారిని కాపాడటానికి రక్తదానం చేయడం గొప్ప మానవత్వమని పేర్కొన్నారు. ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన సర్వేజన ఐక్యవేదిక సభ్యులను, నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో సర్వేజన ఐక్యవేదిక ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.