జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు అనకాపల్లి బెనర్జీ ఆసుపత్రిలో ఫైర్ & సేఫ్టీపై అవగాహన సదస్సు,
మాక్ డ్రిల్ నిర్వహణ 2026వ సంవత్సరం జాతీయ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా 6వ రోజు అయిన ఈరోజు నాడు అనకాపల్లి పట్టణంలోని ముఖ బెనర్జీ ఆసుపత్రిలో ప్రత్యేక అగ్నిమాపక భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.ఈ సదస్సులో ఆసుపత్రి వైద్య సిబ్బంది,పారామెడికల్ స్టాఫ్, హౌస్ కీపింగ్ సిబ్బంది, ఇతర నాన్-మెడికల్ ఉద్యోగులు విస్తృతంగా పాల్గొన్నారు.అగ్నిమాపక విభాగం నిపుణులు సిబ్బందికి అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రాథమిక దశలోనే వాటిని ఎలా నియంత్రించాలి,
భద్రతా చర్యలు ఎలా చేపట్టాలి అనే అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శన మరియు సిద్ధాంతపరమైన శిక్షణ అందించారు.
- CO₂ (కార్బన్ డయాక్సైడ్) అగ్నిమాపక సాధనం మరియు DCP (డ్రై కెమికల్ పౌడర్) ఫైర్ ఎక్స్టింగుషర్లను సరైన రీతిలో ఎలా ఉపయోగించాలి.
- విద్యుత్, మండే ద్రవాలు, సాధారణ పదార్థాల వల్ల కలిగే అగ్ని ప్రమాదాల వద్ద ఏ రకమైన ఎక్స్టింగుషర్ ఉపయోగించాలి.
- మాక్ డ్రిల్ (ఊహాత్మక అగ్నిప్రమాద దృశ్యం) ద్వారా ప్రతి సిబ్బందికి ప్రాక్టికల్గా అగ్నిని ఆర్పే విధానం ప్రదర్శించబడింది. - అగ్ని ప్రమాద సమయంలో భయాందోళనలకు గురికాకుండా, రోగులను మరియు స్వంతాన్ని రక్షించుకునే మార్గాలు.
- ప్రాథమిక జీవ రక్షణ (First Aid) మరియు ఫైర్ ఎక్సిట్ ప్లాన్ గురించి వివరణ.
ఆసుపత్రి ప్రాంగణంలోనే నిజ జీవిత పరిస్థితులను అనుకరిస్తూ సుమారు ఒక గంటపాటు మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిబ్బంది చాలా ఆసక్తిగా పాల్గొని, అగ్నిమాపక సాధనాలను నేరుగా నిర్వహించే అవకాశం పొందారు. ఈ అవగాహన సదస్సు వలన ఆసుపత్రిలో పనిచేసే ప్రతి ఒక్కరికీ అత్యవసర పరిస్థితుల్లో చురుకైన,భద్రతా దృక్పథంతో స్పందించే విధానం బోధపడిందని నిర్వాహకులు తెలిపారు.జాతీయ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు సంస్థల్లో భద్రతా సంస్కృతిని మరింతగా పెంపొందిస్తాయని వారు అభిప్రాయపడ్డారు.
