మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై రెడ్డి అప్పలనాయుడు ఆగ్రహం..

మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై రెడ్డి అప్పలనాయుడు ఆగ్రహం..

03/June/2026 06:42    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, 
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసత్య నిరాధార అనుచిత ప్రసారాలను అరికట్టాలని కోరుతూ ఏలూరు జనసేన పార్టీ  కార్యాలయంలో రెడ్డి అప్పలనాయుడు గారు మంగళవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ లో జనసేన పార్టీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పై వ్యక్తిగతంగా అనుచిత పదజాలం ఉపయోగించడం సరికాదని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణలో పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టడం ఏంటి అని అడుగుతున్నారు. ఏ మీటింగ్ పెట్టాలంటే తెలంగాణ వాడే అవ్వాలా.. ఆంధ్రా వాళ్లు తెలంగాణకి రావద్దని చెప్పడానికి మీరెవరు. తెలంగాణ ఏదైనా మీ అయ్యగారి జాగీరా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ మాత్రమే ఉండాలా కనీస ఇంగిత జ్ఞానం అనేది మీకు ఏమైనా ఉందా పున్నం ప్రభాకర్. చాలా ఘోరమైన పదజాలంతో పవన్ కళ్యాణ్ గారిని దూషించారని మండిపడ్డారు. కెసిఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు తెలంగాణలో మీటింగులు పెట్టుకోలేదా అనుమతి లేకపోయినా కోర్టుకెళ్లి పర్మిషన్లు తెచ్చుకోలేదా అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా అధికారం లేనప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తారా స్వేచ్ఛ స్వతంత్రాన్ని హరించే పరిస్థితిని మనం ఈరోజున చూస్తున్నాం అన్నారు. తెలంగాణలో జనసేన మకాం వేస్తే ఎక్కడ తమ కుర్చీలు కదులుతాయేమోనని కాంగ్రెస్ వాళ్లు భయపడుతున్నారు. జనసేన పార్టీని చూసి అడ్డవెత్తి పోతున్నారు. పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేయడం, రాజకీయ సంస్కృతికి విరుద్ధమని పేర్కొన్న అప్పలనాయుడు తమ నాయకుడు నేర్పిన విలువలు సభ్యత కారణంగానే తాము హుందాగా స్పందిస్తున్నామని చెప్పారు. తెలంగాణపై పవన్ కళ్యాణ్ విషం చిమ్ముతున్నారనే ఆరోపణలు పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి గురించి అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన సభల్లో తెలంగాణ ఉద్యమం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని ఆయన పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణలో వరదలు సంభవించినప్పుడు, కరోనా సమయంలో కూడా సహాయం అందించారన్నారు. ఇటీవల టీటీడీ బోర్డు ద్వారా తెలంగాణలోని ఆలయ అభివృద్ధికి రూ 35.19 కోట్లు నిధులు మంజూరు కావడంలో కూడా పవన్ కళ్యాణ్ కీలకపాత్ర ఉందని తెలిపారు. తెలంగాణ ప్రజల పట్ల ఎప్పుడు సానుకూల దృక్పథంతో వ్యవహరించిన నాయకుడిపై ఇలాంటి విమర్శలు చేయడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ నాయకులు అందరినీ హెచ్చరిస్తూ, తెలంగాణ ఏదైనా మీ అబ్బ సొత్తా అని, తెలంగాణ ఎవరి సొత్తు కాదు, ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందదని పేర్కొన్న ఆయన, తెలంగాణ లో ప్రజలు అన్ని రాజకీయ పరిణామాలను గమనిస్తున్నారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా, వ్యక్తిగత విమర్శలకు దిగడం సరైన రాజకీయం పద్ధతి కాదని విమర్శించారు. రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉండొచ్చు గానీ, వ్యక్తిగత దూషణలు, అవమానకర వ్యాఖ్యలు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదని రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ గారిపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్న వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాలన్నారు.. మీడియా సమావేశంలో రాష్ట్ర కమ్మ కార్పోరేషన్ డైరెక్టర్ కావూరి వాణిశ్రీ, మాజీ డిప్యూటీ మేయర్ శిరిపల్లి శివరామకృష్ణ ప్రసాద్, నగర అధ్యక్షులు వీరంకి పండు, గౌరవ అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, నాయకులు సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, బోండా రాము నాయుడు, జనసేన రవి, నూకల సాయి, కొండల ప్రసాద్, బెజవాడ నాగభూషణం కుమార్, 1టౌన్ మహిళా కార్యదర్శి వెలగా గాయత్రీ తదితరులు పాల్గొన్నారు..
Breaking News

Subscribe our Newsletter